PAK vs AFG | నిప్పులు చెరిగిన రౌఫ్.. తొలి వన్డేలో 142 పరుగులతో గెలిచిన పాకిస్థాన్
PAK vs AFG : ఆసియా కప్, వరల్డ్ కప్ సన్నాహకాల్లో ఉన్న పాకిస్థాన్ భారీ విజయం సాధించింది. అఫ్గనిస్థాన్(Afghanistan)పై మొదటి వన్డేలో 142 పరుగుల తేడాతో గెలుపొందింది. పేసర్ హ్యారిస్ రౌఫ్(Haris Rauf) ఐదు వికెట్లతో అఫ్గన్ జట్టును దెబ్బతీశాడు. వన్డేల్లో అతడికి ఇదే మొదటి...
PAK vs AFG : ఆసియా కప్, వరల్డ్ కప్ సన్నాహకాల్లో ఉన్న పాకిస్థాన్ భారీ విజయం సాధించింది. అఫ్గనిస్థాన్(Afghanistan)పై మొదటి వన్డేలో 142 పరుగుల తేడాతో గెలుపొందింది. పేసర్ హ్యారిస్ రౌఫ్(Haris Rauf) ఐదు వికెట్లతో అఫ్గన్ జట్టును దెబ్బతీశాడు. వన్డేల్లో అతడికి ఇదే మొదటి ఐదు వికెట్ల ప్రదర్శన కావడం విశేషం. లో స్కోర్ నమోదైన ఈ మ్యాచ్‌లో అఫ్గన్ బ్యాటర్లు కనీస పోరాటం చేయకుండానే చేతులెత్తేశారు. దాంతో, మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 201 పరుగులకు ఆలౌటయ్యింది. అఫ్గన్ స్పిన్నర్ల ధాటికి ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్ ఇమాముల్ హక్(61) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. చివర్లో షాదాబ్ ఖాన్(39), ఇఫ్తికార్ అహ్మద్(30) పోరాడడంతో పాక్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. స్వల్ప లక్ష్య ఛేదనలో అఫ్గనిస్థాన్ బ్యాటర్లు తడబడ్డారు. షాహీన్ ఆఫ్రీదీ, హ్యారిస్ రౌఫ్ బుల్లెట్ బంతులను ఎదుర్కోలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. అంతేకాదు ఏకంగా ఐదుగురు డకౌట్ కావడం విశేషం. ముజీబ్(4)ను రౌఫ్ ఔట్ చేయడంతో 59 పరుగులకే అఫ్గనిస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

