దుబాయ్: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్‌ఫ్రెండ్.. దుబాయ్ స్టేడియంలో సందడి చేసింది. ఆదివారం చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ను ఆమె స్టేడియం నుంచి వీక్షించింది. బ్రిటీష్ సింగర్, టీవీ పర్సనాల్టీ జాస్మిన్ వాలియా(Jasmin Walia).. తన ఇన్‌స్టాలో ఆ స్టేడియం ఫోటోలను పోస్టు చేసింది. స్టేడియంలో కూర్చున్న ఆమె.. గీతల షర్ట్ వేసుకున్నది. దుబాయ్ స్టేడియంకు జాస్మిన్ రావడం పట్ల.. హార్దిక్ పాండ్యా తో డేటింగ్ జరుగుతోందన్న రూమర్ మరింత వ్యాపించింది.
గత ఏడాది హార్దిక్, జాస్మిన్లు..ఒకే లొకేషన్ ఫోటోలను షేర్ చేశారు. దీంతో ఆ ఇద్దరూ డేటింగ్ జరుగుతున్నట్లు పుకార్లు షికారు చేశాయి. గ్రీసు దేశంలోని ఓ లొకేషన్ నుంచి ఆ ఇద్దరూ పిక్స్ పెట్టారు. బ్యాక్‌గ్రౌండ్ ఒకే రకంగా ఉండడంతో.. జాస్మిన్, హార్దిక్ మధ్య రిలేషన్ ఉన్నట్లు అభిమానులు ఫిక్స్ అయిపోయారు.
గత ఏడాది జూలైలో హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్లు బ్రేకప్ అయ్యారు. వైవాహిక బంధాన్ని ముగిస్తున్నట్లు ఆ ఇద్దరూ సోషల్ మీడియా స్టేట్మెంట్ ద్వారా ప్రకటించారు. నాలుగేళ్లు కలిసి జీవిచామని, ఇప్పుడు విడిపోతున్నామని ఆమె చెప్పింది. తమ నిర్ణయం కఠినమే అయినా, విడిపోక తప్పడం లేదన్నారు.
హార్దిక్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ జాస్మిన్.. బ్రిటీష్ రియాల్టీ షో ద ఓన్లీ వే ఈజ్ ఎస్ఎక్స్ షోతో ఫేమస్ అయ్యింది. ఇండియాలో కూడాకు ఆమెకు ఫాలోయింగ్ ఉంది. జాక్ నైట్‌తో 2017లో చేసిన బామ్ డిగ్గీ సాంగ్ పాపులరైంది. బిగ్ బాస్ 13 ఫైనలిస్టు అసిమ్ రియాతో కలిసి జాస్మిన్ మ్యూజిక్ వీడియో చేసింది.