Hardik Pandya: కివీస్‌తో మ్యాచ్‌కు హార్దిక్ దూరం
Hardik Pandya: వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో పుణెలో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే ఆదివారం న్యూజిలాండ్‌తో ధర్మశాలలో జరగనున్న మ్యాచ్‌కు అతను దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాతో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ మడిమకు గాయమైంది.
న్యూఢిల్లీ: వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో పుణెలో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే ఆదివారం న్యూజిలాండ్‌తో ధర్మశాలలో జరగనున్న మ్యాచ్‌కు అతను దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాతో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ మడిమకు గాయమైంది. కాలితో బంతిని ఆపేందుకు ప్రయత్నించి అతను గాయపడ్డాడు. దీంతో అతను మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వదిలివెళ్లాడు. హార్ధిక్ కాలికి స్కానింగ్ చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అతను మెడికల్ బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే కివీస్‌తో జరిగే మ్యాచ్‌లో అతను ఆడేది డౌటే అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. లక్నోలో ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండే ఛాన్సు ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. హార్దిక్ గాయం మరీ సీరియస్‌గా ఏమీ లేదని కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కానీ అతను కివీస్‌తో ఆడేది అనుమానంగానే ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

