BCCI | సచిన్ విముఖత.. బీసీసీఐ అధ్యక్షుడి రేసులో భజ్జీ..!
BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడి రేసులో ఉన్నాడంటూ మరో వెటరన్ పేరు ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.
BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అధ్యక్షుడి పదవి సహా కార్యదర్శి, కోశాధికారి పోస్ట్‌లకు ఎలక్షన్స్ జరుగనున్న నేపథ్యంలో పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. ప్రెసిడెంట్ పదవి కోసం టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పోటీ చేస్తారనే కథనాలు వినిపించాయి. కానీ, మాస్టర్ బ్లాస్టర్ విముఖత చూపినట్టు సమాచారం. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడి రేసులో ఉన్నాడంటూ మరో వెటరన్ పేరు ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. అతడు ఎవరో కాదు.. మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh).
అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం కలిగిన హర్భజన్ సింగ్ ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నారు. పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భజ్జీ బీసీసీఐ అధ్యక్ష పదవిపై ఆసక్తితో ఉన్నాడని టాక్. టీమిండియా లెజెండరీ స్పిన్నర్ అయిన అతడిని ఈసారి బరిలోకి దింపాలని పంజాబ్ క్రికెట్ సంఘం భావిస్తోంది. సెప్టెంబర్ 28న జరుగబోయే ఎన్నికలకు భజ్జీని నామినేట్ చేయాలని పీసీఏ పావులు కదుపుతోంది.
🚨 𝑹𝑬𝑷𝑶𝑹𝑻𝑺 🚨
Harbhajan Singh has reportedly been nominated by the Punjab Cricket Association as their representative, putting him in contention to become one of BCCI’s office-bearers. 🙌🏼#Cricket #HarbhajanSingh #BCCI #Sportskeeda pic.twitter.com/yFu7c8o9BO
— Sportskeeda (@Sportskeeda) September 12, 2025
ప్రతి రాష్ట్రం ఒక మాజీ ఆటగాడిని నామినేట్ చేసేందుకు వీలుంటుంది. సెప్టెంబర్ 20-21 తేదీల్లో నామినేషన్లను స్వీకరిస్తామని బీసీసీఐ ఎన్నికల అధికారి ఏకే జోటి తెలిపాడు. సో.. వచ్చే వారంలో ఆసక్తిగల అభ్యర్థుల జాబితా రానుంది. దాంతో.. అప్పుడుగానీ ప్రెసిడెంట్ పోటీలో ఉండేది ఎవరు? అనే విషయంపై స్పష్టత వస్తుంది. అయితే.. తాను బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో ఉన్నాననే విషయాన్ని హర్భజన్ ఇంకా ధ్రువీకరించలేదు.
సెప్టెంబర్ 22 నుంచి వడబోత
బీసీసీఐ కొత్త అధ్యక్షుడి పదవికి నామినేషన్‌కు సెప్టెంబర్ 12 తుది గడువు. ఓటు హక్కు కలిగిన రాష్ట్ర క్రికెట్ సంఘాలు తమ అభ్యర్థి పేరును తెలియజేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ విషయానికొస్తే.. సెప్టెంబర్ 22 నుంచి దరఖాస్తుల పరిశీలన, వడబోత మొదలవుతుంది. సెప్టెంబర్ 23 వరకూ అభ్యర్థులు నామినేషన్‌ను వెనక్కి తీసుకోవచ్చు. ఆ తర్వాత పోటీలో ఉన్నవారి తుది జాబితాను ప్రకటిస్తారు. సెప్టెంబర్ 28న ఎన్నికలు జరుగుతాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1300 పాయింట్లకుపైగా జంప్..!
Siddhu 10 | సిద్ధు జొన్నలగడ్డ 10వ సినిమా ప్రారంభం.. సుకుమార్ రైటింగ్స్‌తో చేతులు కలిపిన స్టార్ బాయ్!
Kolkata-Sairang Express: ఎమర్జెన్సీ బ్రేక్స్ కోసం ఇంజిన్ డ్రైవర్ ప్రయత్నం.. అస్సాం రైలు ప్రమాదం వీడియో వైరల్
Satavahana University | కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం : వీడియో
Dada | ‘దాదా’లో సింగర్‌గా మారిన బాలయ్య.. ‘దాదా ధమాకా’లో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

