సెయింట్ లూయిస్ (ఫ్రాన్స్): ప్రపంచ చెస్ చాంపియన్, భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ గ్రాండ్ చెస్ టూర్లో తడబడుతున్నాడు. సెయింట్ లూయిస్‌లో జరుగుతున్న ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీలో గుకేశ్.. బ్లిట్జ్ తొలి రౌండ్ ముగిసేసరికి నాలుగో స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయాడు. గురువారం జరిగిన బ్లిట్జ్ సెక్షన్లో గుకేశ్.. నాలుగు గేమ్‌లలో ఓడగా నాలుగింటిని డ్రా చేసుకున్నాడు. అమెరికా ఆటగాడు లీనియర్ డొమింగెజ్‌తో గేమ్‌ను మాత్రమే గెలుచుకున్నాడు. ర్యాపిడ్ విభాగం ముగిసేప్పటికీ 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న ఈ చెన్నై కుర్రాడు.. బ్లిట్జ్ తొలి రౌండ్లో మూడు పాయింట్లు మాత్రమే సాధించి ఓవరాల్‌గా 13 పాయింట్లతో 6వ స్థానానికి దిగజారాడు. అమెరికాకు చెందిన లెవొన్ అరోనియన్ 19 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోటిన్నర జాబ్ ఆఫర్ వదులుకుని..