సింగపూర్: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో డింగ్ లిరెన్, గుకేశ్ మధ్య డ్రాల పరంపర కొనసాగుతున్నది. శనివారం జరిగిన ఐదో గేమ్‌లో తెల్లపావులతో బరిలోకి దిగిన గుకేశ్..లిరెన్‌తో కడదాకా పోరాడి గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. దీంతో వరుసగా రెండో డ్రా ఎదురుకావడంతో ఇద్దరు ప్రస్తుతం 2.5 పాయింట్లతో కొనసాగుతున్నారు. ఎవరైతే తొలుత 7 పాయింట్లు సాధిస్తారో వారినే ప్రపంచ టైటిల్ వరించనుంది.