మహిళల క్రికెట్ ప్రపంచకప్ మొదలైన సందర్భంగా గూగుల్ సంస్థ ఒక డూడుల్ సృష్టించింది. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు మహిళల ప్రపంచకప్ 12వ ఎడిషన్ మొదలైంది. ఈ సందర్భంగా ఆరుగురు ప్లేయర్లు క్రికెట్ ఆడుతున్న డూడుల్‌ను గూగుల్ తయారు చేసింది. స్టేడియంలో క్రికెట్ ఆడుతున్న వీళ్లను ప్రేక్షకులు చూస్తున్నట్లు ఉంది. దీనిపై క్లిక్ చేసి గూగుల్ హోంపేజ్కి వెళ్తే.. ఎడమ నుంచి కుడివైపు క్రికెట్ బాల్స్ వెళ్తున్నాయి.
అప్పుడు పేజ్ కింది వైపు కాంఫెట్టి పాపర్ సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మరిన్ని క్రికెట్ బాల్స్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. న్యూజిల్యాండ్‌లోని బే ఓవల్ స్టేడియంలో మహిళల క్రికెట్ ప్రపంచకప్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో న్యూజిల్యాండ్, వెస్టిండీస్ తలపడగా.. చివర్లో మూడు వికెట్లు కూల్చిన విండీస్ జట్టు విజయ ఢంకా మోగించింది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పోటీ పడుతున్నాయి.
New Google Doodle has been released: "Women's Cricket World Cup 2022 Begins!" 🙂#google #doodle #designhttps://t.co/oM7i79OJ1E pic.twitter.com/UeRDYk14qt
— Google Doodles EN (@Doodle123_EN) March 3, 2022