హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత్‌లో వాలీబాల్‌కు మంచి రోజులు రాబోతున్నాయి. ఇప్పటికే ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్) ద్వారా ప్రతిభ కల్గిన ప్లేయర్లు వెలుగులోకి వస్తుండగా, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటేందుకు మరో అడుగు ముందుకు పడింది. ఇటలీ సూపర్‌లీగ్‌లో ప్రముఖ క్లబ్‌గా పేరొందిన పల్లవొలో పడోవాతో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ జట్టు కట్టింది.
దేశంలో ప్రపంచ స్థాయి వాలీబాల్ కోచింగ్‌తో పాటు మౌలిక వసతుల కల్పనలో భాగం కానుంది. పీవీఎల్‌లో మిగతా జట్లతో పోలిస్తే..భారత వాలీబాల్‌లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ ఉన్నత స్థాయి ప్రమాణాలు నెలకొల్పింది. వాలీబాల్‌లో సుదీర్ఘ అనుభవమున్న కోచ్‌గా నియమించడంతో పాటు ఆటను అభిమానులను మరింత చేరువయ్యేలా చేశామని బ్లాక్‌హాక్స్ యజమాని అభిషేక్‌రెడ్డి పేర్కొన్నారు.