హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇటీవల ముగిసిన ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో కనబరిచిన దూకుడునే భవిష్యత్‌లో కొనసాగిస్తానని తెలంగాణ యువ క్రికెటర్ గొంగడి త్రిష పేర్కొంది. టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలువడంలో కీలకంగా వ్యవహరించిన త్రిషను ఏఆర్కే గ్రూపు ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘కెరీర్ తొలి నాళ్లనుంచి నాకు ఏఆర్కే గ్రూపు మద్దతుగా నిలుస్తూ వస్తుంది. ప్రతీ సందర్భంలో వారు నాకు వెన్నంటి నిలిచారు. రానున్న రోజుల్లో దేశం గర్వపడేలా రాణించేందుకు మరింతగా కష్టపడుతాను’ అని అంది. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ దిగ్గజం గోపీచంద్, మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, ఏఆర్కే చైర్మన్ రామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.