చెన్నై: ఈ ఏడాది ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ పరుగుల వరద పారిస్తున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న మాక్స్వెల్ స్పిన్, పేస్ బౌలర్లను ఉతికారేస్తున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో 9/2తో కష్టాల్లో ఉన్న జట్టును మాక్స్వెల్ ఆదుకున్నాడు. మూడో ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన మాక్సీ ధనాధన్ బ్యాటింగ్‌తో 28 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. అందులో 6ఫోర్లు, 2సిక్సర్లు ఉన్నాయి. 10 ఓవర్లకు బెంగళూరు 2 వికెట్లకు 84 పరుగులు చేసింది. ప్రస్తుతం మాక్సీ(55), దేవదత్ పడిక్కల్(19) క్రీజులో ఉన్నారు.
Maxwell on the charge for the @RCBTweets.
— IndianPremierLeague (@IPL) April 18, 2021
A 50-run partnership comes up between @Gmaxi_32 & @devdpd07.
Live – https://t.co/sgj6gqp6tS #RCBvKKR #VIVOIPL pic.twitter.com/w42bzi0Imv