World Cup 2023 | అతడి వికెట్ తీస్తేనే ఫైనల్‌కు దక్షిణాఫ్రికా : డివిలియర్స్
World Cup 2023 : వరల్డ్ కప్‌లో దంచికొట్టడమే పనిగా పెట్టుకున్న దక్షిణాఫ్రికా(South Africa) కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. తొలిసారి ఫైనల్ ముంగిట నిలిచిన సఫారీ టీమ్.. గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియా(Australia)తో తలపడనుంది. ఐసీసీ ట్రోఫీ కోసం చకోరా పక్షిలా నిరీక్షిస్తున్న దక్షిణాఫ్రికా...
World Cup 2023 : వరల్డ్ కప్‌లో దంచికొట్టడమే పనిగా పెట్టుకున్న దక్షిణాఫ్రికా(South Africa) కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. తొలిసారి ఫైనల్ ముంగిట నిలిచిన సఫారీ టీమ్.. గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియా(Australia)తో తలపడనుంది. ఐసీసీ ట్రోఫీ కోసం చకోరా పక్షిలా నిరీక్షిస్తున్న దక్షిణాఫ్రికా కంగారూలకు చెక్ పెట్టాలనే కసితో ఉంది. ఈ మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్.. బవుమా సేనను హెచ్చరించాడు.
సెమీఫైనల్లో సఫారీలకు విధ్వంసక ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ నుంచి ముప్పు పొంచి ఉందని, అతడిని త్వరగా ఔట్ చేస్తేనే దక్షిణాఫ్రికా ఫైనల్‌కు వెళ్తుందని డివిలియర్స్ అన్నాడు. ‘ఆసీస్ ఎప్పుడూ కఠినమైన ప్రత్యర్థే. తొలి రెండు మ్యాచ్‌ల ఓటమి తర్వాత కమిన్స్ సేన అనూహ్యంగా పుంజుకుంది.
ఏబీ డివిలియర్స్

అయితే.. అఫ్గనిస్థాన్‌పై మ్యాక్స్‌వెల్(201 నాటౌట్) ఇన్నింగ్స్ నిజంగా ఓ ఊచకోత. అందకని సఫారీలు అతడిని తేలికగా తీసుకోవద్దు. అతడిని ఎంత త్వరగా పెవలియన్‌కు పంపిస్తారనేది చాలా ముఖ్యం’ అని ఈ మిస్టర్ 360 తెలిపాడు.వరల్డ్ కప్ లీగ్ దశలో ఆస్ట్రేలియాను ఓడించిన సఫారీలు సెమీస్‌లోనూ అదే ఫలితాన్ని రాబట్టాలనే కసితో ఉన్నారు.
దక్షిణాఫ్రికా VS ఆస్ట్రేలియా

ఈ మ్యాచ్‌లో ప్రొటిస్ టీమ్ గెలిస్తే.. నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరిగే టైటిల్ పోరులో టీమిండియాతో తలపడుతుంది. మెగా టోర్నీలో బలమైన జట్టలో ఒకటైన దక్షిణాఫ్రికా ఆది నుంచి అదరగొట్టింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ నుంచి లోయర్ ఆర్డర్లో జాన్సేన్ వరకు దంచి కొట్టగల బ్యాటర్లు ఉండడం.. బౌలింగ్‌లో రబాడ, ఎంగిడి, కోయెట్టీతో పాటు కేశవ్ మహారాజ్, షంసీ రాణిస్తుండడం సఫారీలకు కలిసి రానుంది.
ఇవి కూడా చదవండి
-
World Cup 2023 | విలియమ్సన్‌ను హత్తుకున్న కోహ్లీ.. ఐసీసీ పోస్ట్ వైరల్
-
David Becham: వాంఖడే స్టేడియంలో సచిన్, కోహ్లీతో డేవిడ్ బెక్‌హమ్.. వీడియో
-
Virat Kohli In | విరాట్ కోహ్లీ బయోపిక్.. హీరోగా ఎవరు నటిస్తే బాగుంటుందో చెప్పిన రణ్‌బీర్ కపూర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ అభిమానుల పాదయాత్ర.. ఎర్రవల్లికి బయలుదేరిన యువ నాయకులు
Telugu Cinema | హింసే పరమావధిగా టాలీవుడ్ సినిమాలు.. వెనకబడుతున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ!
Vivek Oberoi | రియల్ హీరో అనిపించుకున్న వివేక్ ఒబెరాయ్.. రెమ్యునరేషన్ రూ.6 కోట్లు క్యాన్సర్ బాధిత చిన్నారులకు విరాళం!
Abhishek Banerjee: బీజేపీ గూండాలు ఇంటిపై దాడి చేశారు.. వీడియో షేర్ చేసిన టీఎంసీ ఎంపీ అభిషేక్
Ramayana | ‘రామాయణం’లో జటాయువు ఎపిసోడ్‌కు అదిరిపోయే స్పందన.. ఆ పాత్రతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్‌రాజు?
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

