Glenn Maxwell | గ్లెన్ ‘డక్’వెల్.. ఐపీఎల్లో కొనసాగుతున్న మ్యాక్స్‌వెల్ వైఫల్య ప్రదర్శన
Glenn Maxwell | 0, 3, 28, 0, 1, 0.. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ చేసిన పరుగులివి. 2021 నుంచి ఆర్సీబీకి ఆడుతున్న ఈ ఆస్ట్రేలియా విధ్వంసకవీరుడు.. గత మూడు సీజన్లలో అదరగొట్టాడు. 2021లో 513 పరుగులు చేసిన మ్యాక్సీ.. 2022లో 301, 2023లో 400 రన్స్ చేశాడు. గతేడాది కోహ్లీ, డుప్లెసిస్‌తో కలిసి మ్యాక్స్‌వెల్ (అభిమానులు ఈ త్రయాన్ని కేజీఎఫ్ అని పిలుచుకున్నారు) ప్రత్యర్థుల బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు.
Glenn Maxwell | 0, 3, 28, 0, 1, 0.. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ చేసిన పరుగులివి. 2021 నుంచి ఆర్సీబీకి ఆడుతున్న ఈ ఆస్ట్రేలియా విధ్వంసకవీరుడు.. గత మూడు సీజన్లలో అదరగొట్టాడు. 2021లో 513 పరుగులు చేసిన మ్యాక్సీ.. 2022లో 301, 2023లో 400 రన్స్ చేశాడు. గతేడాది కోహ్లీ, డుప్లెసిస్‌తో కలిసి మ్యాక్స్‌వెల్ (అభిమానులు ఈ త్రయాన్ని కేజీఎఫ్ అని పిలుచుకున్నారు) ప్రత్యర్థుల బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. బెంగళూరు హోంగ్రౌండ్ ‘చిన్నస్వామి’లో అయితే ఈ ఆసీస్ చిచ్చరపిడుగు విధ్వంసం తారాస్థాయికి చేరేది. మ్యాక్సీ క్రీజులోకి వచ్చాడంటే బంతి మ్యాగ్జిమమ్ గాల్లోనో లేదంటే స్టాండ్స్‌లో ప్రేక్షకుల చేతుల్లోనో ఉండేది. గత సీజన్లో పూనకం వచ్చినవాడిగా ఊగిపోయిన అతడి స్ట్రైక్ రేట్ 183.29గా నమోదైంది. కానీ ఈ సీజన్లో మాత్రం అతడు ఘోరంగా విఫలమవుతున్నాడు. 2024 సీజన్ 6 ఇన్నింగ్స్‌లలో అతడు చేసింది 32 పరుగులే. అందులోనూ మూడు డకౌట్స్. కోల్‌కతాతో మ్యాచ్‌లో ముక్కీ మూలుగుతూ 28 పరుగులు చేసినా అదీ కేకేఆర్ ఆటగాళ్లు మూడు క్యాచ్‌లు మిస్ చేస్తే చేసినవి. చెన్నై, లక్నో, ముంబైతో మ్యాచ్‌లలో మ్యాక్సీ అలా వచ్చి ఇలా వెళ్లాడు.
గతేడాది ఐపీఎల్ తర్వాత వన్డే వరల్డ్ కప్, భారత్‌లో టీ20 సిరీస్, ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్‌లోనూ ఫర్వాలేదనిపించిన మ్యాక్స్‌వెల్.. తాజా సీజన్లో మాత్రం తన మార్కును చూపలేకపోతున్నాడు. ఆరంభంలో వరుస మ్యాచ్‌లలో విఫలమైన అతడు.. ఆర్సీబీ కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి ఒత్తిడికి చిత్తవుతున్నాడు. ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్లో కీలకమైన మ్యాక్సీ ఇకనైనా మేలుకోకుంటే తుది జట్టులో అతడిని పక్కనబెట్టడంతో పాటు టీమ్ నుంచి తప్పించినా ఆశ్చర్యపోవాల్సిన పన్లేదు. స్పిన్ అంటేనే ఊగిపోయి బ్యాటింగ్ చేసే ఈ ఆసీస్ వీరుడు.. తాజా సీజన్లో స్పిన్నర్లకే మూడు సార్లు వికెట్ సమర్పించుకున్నాడు.
‘ఒత్తిడి సమయాల్లో ఆర్సీబీ స్టార్ బ్యాటింగ్ విభాగం సరైన ప్రదర్శన చేయదు. వేలంలో భారీ ధర దక్కించుకుంటున్న అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు దారుణంగా విఫలమవుతున్నారు. క్లిష్ట సమయాల్లో అందరూ డ్రెస్సింగ్ రూముల్లోనే ఉంటే దేశవాళీ ప్లేయర్లు తాకత్తుకు మించి రాణిస్తున్నారు’ అన్న రాయుడు మాటలను నిజం చేస్తూ మ్యాక్స్‌వెల్ వైఫల్య ప్రదర్శన కొనసాగిస్తున్నాడు.
– నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

