World Cup 2023 : వన్డే ప్రపంచ కప్ చివరి లీగ్ మ్యాచ్లో భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్(52) దంచి కొట్టాడు. నెదర్లాండ్స్ బౌలర్లపై ప్రతాపం చూపిస్తూ హాఫ్ సెంచరీ బాదాడు. కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడిన గిల్.. ఆర్యన్ దత్ వేసిన 3వ ఓవర్ ఆఖరి బాల్కు 95 మీటర్ల భారీ సిక్స్ కొట్టాడు. ఆ బంతి స్టేడియం రూఫ్కి తగలడంతో నాన్స్ట్రయికర్ రోహిత్ శర్మ వావ్ అన్నట్టు రియాక్షన్ ఇచ్చాడు.
Shubman Gill – Six – India vs Netherlands .@cricketworldcup #INDvsNED #NEDvsIND #ICCCricketWorldCup23 pic.twitter.com/CYBNfAUz1J
— CWC23 (@official_cwc23) November 12, 2023
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఆది నుంచి ధాటిగ ఆడిన గిల్ (52 : 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ శతకం తర్వాత.. వాన్ మీకెరన్ బౌలింగ్లో భారీ షాట్ ఆడాడు. బౌండరీ లైన్ వద్ద తేజ నిడమనూరు అద్భుత క్యాచ్ పట్టడంతో నిరాశగా వెనుదిరిగాడు. దాంతో, తొలి వికెట్కు 100 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.