బెర్లిన్ : జర్మన్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ద్వయం ధృవ్ కపిల, తనీశా క్యాస్ట్రో పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో ధృవ్, తనీశ జోడీ 23-25, 21-10, 15-21తో ఇండోనేషియా జంట రేహాన్ నౌఫాల్, గ్లోరయా ఇమాన్యుయెల్ చేతిలో ఓడింది. గంట పాటు సాగిన పోరులో ఎనిమిదో సీడ్ జోడీ ప్రత్యర్థికి దీటైన పోటీనివ్వడంలో విఫలమైంది.