T20 World Cup 2024 | ఆస్ట్రేలియా స్క్వాడ్‌లో యువకెరటం.. ఆల్‌రౌండర్‌గా అతడేనా..?
T20 World Cup 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్ సంగ్రామం ముగిసి వారంలోనే టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024) షురూ కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు స్క్వాడ్‌ను ప్రటించాయి. అయితే.. మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా(Australia) అనూహ్యంగా తమ బృందంలో మార్పులకు తెర తీసింది.
T20 World Cup 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్ సంగ్రామం ముగిసి వారంలోనే టీ20 వరల్డ్ కప్(T20 World Cup) షురూ కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు స్క్వాడ్‌ను ప్రటించాయి. అయితే.. మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా(Australia) అనూహ్యంగా తమ బృందంలో మార్పులకు తెర తీసింది. ఐపీఎల్ పదిహేడో సీజన్లో దంచికొట్టిన యువకెరటం జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(Jake Fraser Mcgurk)కు ట్రావెల్ రిజర్వ్‌గా చోటు కల్పించనుంది. ఆల్‌రౌండర్ మాథ్యూ షార్ట్(Mathew Short) సైతం 17వ ఆటగాడిగా ఎంపికయ్యే చాన్స్ ఉందని సమాచారం.
ప్రపంచంలోనే మేటి జట్టు అయిన ఆసీస్ మూడు ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీలు నెగ్గింది. 2021లో అరోన్ ఫించ్ (Aaron Finch) సారథ్యంలో పొట్టి ట్రోఫీని తన్నుకుపోయిన ఆసీస్ రెండో టైటిల్ వేటకు కాచుకొని ఉంది. వరల్డ్ కప్ హీరో మిచెల్ మార్ష్ నేతృత్వంలోని బలమైన బృందాన్నే సెలెక్టర్లు ఎంపిక చేశారు.

అయితే.. ఆ 15 మంది జాబితాలో ఫ్రేజర్ పేరు లేకపోవడం క్రికెట్ పండితులను ఆశ్చర్యానికి గురి చేసింది. టాపార్డర్‌లో భయం లేకుండా ఆడే ఈ చిచ్చరపిడుగును తీసుకోవాల్సిందేననే డిమాండ్లు వినిపించాయి. దాంతో ఎట్టకేలకు తమ పొరపాటును గ్రహించిన సెలెక్టర్లు ఫ్రేజర్‌తో పాటు విధ్వంసక ఆల్‌రౌండర్ షార్ట్‌ను ట్రావెల్ రిజర్వ్‌లుగా తీసుకునేందుకు సిద్దమయ్యారు. పదిహేడో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఫ్రేజర్ దంచికొట్టాడు. ఈ డేరింగ్ హిట్టర్ 14 ఇన్నింగ్స్‌ల్లోనే 4 హాఫ్ సెంచరీలతో 330 రన్స్ సాధించాడు. మరోవైపు షార్ట్ బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుతంగా రాణించాడు.
ఆస్ట్రేలియా సైన్యమిదే : డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్(కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, అష్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్ వుడ్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్, ఆడం జంపా.
ఇవి కూడా చదవండి
- Satyabhama | సత్యభామ ప్రమోషన్స్.. కాజల్ అగర్వాల్‌కు ఫోన్ చేయాలనిపించే హీరోలెవరంటే..?
- Loksabha Elections 2024 | జూన్ 4న కొలువుతీరనున్న విపక్ష కూటమి సర్కార్ : అరవింద్ కేజ్రీవాల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

