Congress | కాంగ్రెస్ రాకతో ఫార్ములా-ఈ రేసు రద్దు..
ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసు మళ్లీ భారత్‌కు రాబోతున్నది. గతేడాది కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ వేదికగా అట్టహాసంగా నిర్వహించింది. దేశంలో తొలిసారిగా ఆతిథ్యమిస్తూ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. స్వల్ప వ్యవధిలోనే దేశంలోని మిగతా నగరాలను వెనకకు నెడుతూ అదిరిపోయే రీతిలో హైదరాబాద్‌లో రేసింగ్ నిర్వహించింది.
- గతేడాది హైదరాబాద్‌లో ఘనంగా ఫార్ములా-ఈ
- ప్రభుత్వం మారడంతో ప్రతిష్ఠాత్మక రేసుకు మంగళం
- 2026లో భారత్‌లో రేసింగ్‌కు నిర్వాహకుల ప్రయత్నం
Congress | లండన్: ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసు మళ్లీ భారత్‌కు రాబోతున్నది. గతేడాది కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ వేదికగా అట్టహాసంగా నిర్వహించింది. దేశంలో తొలిసారిగా ఆతిథ్యమిస్తూ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. స్వల్ప వ్యవధిలోనే దేశంలోని మిగతా నగరాలను వెనకకు నెడుతూ అదిరిపోయే రీతిలో హైదరాబాద్‌లో రేసింగ్ నిర్వహించింది. అన్నీతానై వ్యవహరించిన అప్పటి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఫార్ములా-ఈ రేసింగ్ హైదరాబాద్‌కు తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ రాకతో ప్రతిష్ఠాత్మక రేసు ఊహించని రీతిలో రద్దయ్యింది. ఒప్పందానికి ఫుల్స్టాప్ పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఫార్ములా-ఈ రేసింగ్ నిర్వహణకు బ్రేక్‌లు పడ్డాయి. అయితే భారత్‌లో రేసింగ్ మార్కెట్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని తిరిగి రేసింగ్‌ను తీసుకొచ్చేందుకు నిర్వహకులు ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే దేశంలో ప్రముఖ నగరాల్లో రేసు నిర్వహించేందుకు చర్చలు జరుగుతున్నట్లు, అన్నీ కుదిరితే భారత్‌లో 2026 ఫార్ములా-ఈ రేసు జరుగుతుందని కోఫౌండర్ అల్బర్టో లాంగో శుక్రవారం పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణలో ప్రభుత్వం మారిన కారణంగా దురదృష్ణవశాత్తు రేసు నిర్వహించలేకపోయాం. అంతకుముందు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం అర్ధాంతరంగా ముగిసింది. గతేడాది హైదరాబాద్‌లో రేసు అద్భుతంగా జరిగింది. వాతావరణానికి అనుకూలంగా ఉండేలా, వ్యర్థాలను వినియోగిస్తూ రేసింగ్ నిర్వహించాం. భారత్ మాకు చాలా పెద్ద మార్కెట్. వచ్చే ఏడాది కాకపోయినా..కచ్చితంగా 2026లో ఇక్కడ రేసింగ్ నిర్వహిస్తాం. ఇప్పటికే కొన్ని నగరాలను పరిశీలించాం. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం’ అని అన్నారు. 2023లో అప్పటి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం దేశం దృష్టిని ఆకర్షిస్తూ రేసింగ్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

