Marketa Vondrousova : మహిళల టెన్నిస్లో ఓ వెలుగు వెలుగిన మార్కెట ఒండ్రుసోవా(Marketa Vondrousova) నిషేధానికి గురైంది. డోపింగ్ టెస్టుకు నిరాకరించినందుకు భారీ మూల్యంగా ఆమె నాలుగేళ్లు ఆటకు దూరమవ్వనుంది. అథ్లెట్లు నిషేధిత డ్రగ్స్ ఉపయోగించారా? లేదా? అనేది తేల్చడం కోసం నిర్వహించే డోప్ పరీక్షల్ని తిరస్కరించిన ఒండ్రుసోవాపై స్వతంత్ర ట్రబ్యునల్ విచారణ జరిపింది. ఆమె ఉద్దేశపూర్వకంగానే టెస్టుకు అంగీకరించలేదని తేలడంతో టెన్నిస్ నుంచి నాలుగేళ్లు సస్పెండ్ చేసింది.
వింబుల్డన్ మాజీ ఛాంపియన్ అయిన ఒండ్రుసోవా నిరుడు డిసెంబర్లో డోప్ పరీక్షలకు నిరాకరించింది. ఆమెకు పరీక్షలు చేసేందుకు వెళ్లిన డోపింగ్ నియంత్రణ అధికారిని తను ఇంట్లోకి రానివ్వలేదు. దాంతో, అంతర్జాతీయ టెన్నిస్ సమగ్రత ఏజన్సీ ఆమెపై కేసు వేసింది. స్వతంత్ర ట్రిబ్యునల్ విచారణలో తాను ఒత్తిడిలో, మానసిక ఆరోగ్యం బాగా లేనందున తాను డోప్ టెస్టుకు సిద్ధపడలేని ఒండ్రుసోవా తెలిపింది.
BREAKING:
Marketa Vondrousova has been suspended for four years by an independent tribunal for ‘refusing an anti-doping test’ outside of her scheduled testing window in December 2025.
Marketa has stated that she has been struggling with her mental health and she reached a… pic.twitter.com/RuTDqxt0ef
— The Tennis Letter (@TheTennisLetter) June 22, 2026
కానీ, ఆవేవీ సహేతుకమైన కారణాలు కాదని ట్రిబ్యునల్ తేల్చింది. దాంతో, ఉద్దేశపూర్వకంగానే టెస్టుకు దూరమైన ఆమెపై నాలుగేళ్ల నిషేధం విధించింది. 2030 జూన్ 31 వరకూ ఒండ్రుసోవాపై నిషేధం కొనసాగుతుందని ట్రిబ్యునల్ తెలిపింది. కోర్టు తీర్పును స్పోర్ట్స్ అర్బిట్రేషన్ కోర్టులో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి సవాల్ చేసే అవకాశముంది.