Lucknow Super Giants | లక్నో సూపర్ జెయింట్స్ అసిస్టెంట్ కోచ్‌గా భారత మాజీ స్పిన్నర్
Lucknow Super Giants : ఐపీఎల్ 16వ సీజన్లో ప్లే ఆఫ్స్ దాటలేకపోయిన లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. తాజాగా ఈ ఫ్రాంచైజీ మరో కీలక పోస్ట్‌ను భర్తీ చేసింది. భారత మాజీ స్పిన్నర్ శ్రీధరన్ శ్రీరామ్(Sridharan Sriram)ను...
Lucknow Super Giants : ఐపీఎల్ 16వ సీజన్లో ప్లే ఆఫ్స్ దాటలేకపోయిన లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. హెడ్‌కోచ్‌గా జస్టిన్ లాంగర్(Justin Langer)ను తీసుకోవడంతో పాటు టీమిండియా మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్(MSK Prasad)కు స్ట్రాటజిక్ కన్సల్టెంట్(Strategic Consultant)గా బాధ్యతలు అప్పగించింది. తాజాగా ఈ ఫ్రాంచైజీ మరో కీలక పోస్ట్‌ను భర్తీ చేసింది. భారత మాజీ స్పిన్నర్ శ్రీధరన్ శ్రీరామ్(Sridharan Sriram)ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది. 2024 సీజన్లో శ్రీరామ్ హెడ్ కోచ్ లాంగర్‌తో కలిసి పని చేయనున్నాడు.
శ్రీరామ్‌కు పలు జట్లకు కోచింగ్ ఇచ్చిన అనుభవం ఉంది. ఆస్ట్రేలియా టీ20 జట్టుకు 2021- 22 సీజన్లో శ్రీరామ్ సహాయక కోచ్‌గా పని చేశాడు. బంగ్లాదేశ్ పురుషుల టీ20 జట్టుకు కోచ్‌గా సేవలందించాడు. అతడి హయాంలో బంగ్లా జట్టు సూపర్ 12లో అద్భుత విజయాలు సాధించింది. అంతేకాదు ఐపీఎల్‌లోనూ శ్రీరామ్ తన మార్క్ పనితీరుతో ఆకట్టుకున్నాడు.
ఆస్ట్రేలియా స్పిన్నర్ లియాన్‌కు సలహాలిస్తున్న శ్రీరామ్

గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పని చేశాడు. శ్రీరామ్ దేశవాళీ క్రికెట్లో 200 మ్యాచ్‌లు ఆడాడు.13,500 పరుగులు సాధించడమే కాకుండా 200 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల ప్రదర్శనతో భారత జట్టుకు ఎంపికయ్యాడు. శ్రీరామ్ 2000-04 ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు.
ఇవి కూడా చదవండి
David Warner | ఓపెనర్‌గా 20 సెంచరీలు.. తొలి ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా వార్నర్ రికార్డు
Neymar | బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్.. దివంగత పీలే రికార్డు బ్రేక్ చేసిన నెయ్మర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

