David Warner | ఓపెనర్‌గా 20 సెంచరీలు.. తొలి ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా వార్నర్ రికార్డు
David Warner : వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) ముందు ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) మరో రికార్డు సృష్టించాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ ఓపెనర్‌గా వన్డే ఫార్మాట్లో 6 వేల పరుగుల మైలురాయికి చేరువయ్యాడు. దక్షిణాఫ్రికాపై రెండో వన్డేలో సెంచరీ(106) బాదిన వార్నర్ రెండో ఆసీస్ బ్యాటర్‌గా....
David Warner : వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) ముందు ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) మరో రికార్డు సృష్టించాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ ఓపెనర్‌గా వన్డే ఫార్మాట్లో 6 వేల పరుగుల మైలురాయికి చేరువయ్యాడు. దక్షిణాఫ్రికాపై రెండో వన్డేలో సెంచరీ(106) బాదిన వార్నర్ ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. ఆసీస్ తరఫున 50 ఓవర్ల క్రికెట్లో 20 సెంచరీలు బాదిన ఓపెనర్‌గా మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు ఓపెనర్‌గా వచ్చి 6 వేల పరుగులు బాదిన రెండో ఆసీస్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు వికెట్ కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్(Adam Gilchrist) సరసన నిలిచాడు. ఒకప్పుడు చిచ్చరపిడుగుగా పేరొందిన గిల్‌క్రిస్ట్ ఓపెనర్‌గా వన్డేల్లో 9,176 వేల పరుగులు కొట్టాడు.
ఈ ఏడాది జోరుమీదున్న వార్నర్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో దంచి కొడుతున్నాడు. ఈరోజు జరుగుతున్న రెండో వన్డేలో ఈ డాషింగ్ ఓపెనర్ సెంచరీతో కదం తొక్కాడు. సఫారీ బౌలర్లను ఉతికారేస్తూ 93 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 106 రన్స్ కొట్టాడు. అంతేకాదు మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(64)తో కలిసి తొలి వికెట్‌కు 109 రన్స్ జోడించి ఆసీస్ భారీ స్కోర్‌కు బాటలు వేశాడు.
డేవిడ్ వార్నర్, ఆడం గిల్‌క్రిస్ట్

ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కెప్టెన్‌గా వార్నర్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐదు హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. అయితే.. పృథ్వీ షా, మనీశ్ పాండే, మిచెల్ మార్ష్ మంటి స్టార్ బ్యాటర్లు విఫలం కావడంతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. ఆ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్, యాషెస్ సిరీస్(Ashes Series)లోనూ వార్నర్ విలువైన పరుగులు సాధించాడు. వన్డే ప్రపంచ కప్ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్న వార్నర్ దక్షిణాఫ్రికాపై సెంచరీతో ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరికలే పంపాడు.
ఇవి కూడా చదవండి
Neymar | బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్.. దివంగత పీలే రికార్డు బ్రేక్ చేసిన నెయ్మర్
Sachin Tendulkar | వన్డేల్లో సెంచరీకోసం ఐదేళ్లు నిరీక్షించిన సచిన్.. ఏ జట్టుపై కొట్టాడంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

