Neymar | బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్.. దివంగత పీలే రికార్డు బ్రేక్ చేసిన నెయ్మర్
Neymar : వరల్డ్ కప్ క్వాలిఫయర్స్()లో బ్రెజిల్ స్టార్ ఆటగాడు నెయ్మర్ జూనియర్(Neymar Junior) అరుదైన ఘనత సాధించాడు. సొంత గడ్డపై బొలివియా(Bolivia) మీద రెండు గోల్స్ కొట్టిన అతను దివంగత ఫుట్‌బాలర్ పీలే(Pele) రికార్డు బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో నెయ్మర్ 61వ, 93వ నిమిషంలో...
Neymar : వరల్డ్ కప్ క్వాలిఫయర్స్(World Cup Qualifiers 2026)లో బ్రెజిల్ స్టార్ ఆటగాడు నెయ్మర్ జూనియర్(Neymar Junior) అరుదైన ఘనత సాధించాడు. సొంత గడ్డపై బొలీవియా(Bolivia) మీద రెండు గోల్స్ కొట్టిన అతను దివంగత ఫుట్‌బాలర్ పీలే(Pele) రికార్డు బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో నెయ్మర్ 61వ, 93వ నిమిషంలో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. దాంతో, అతడి గోల్స్ 79కు చేరింది. ఈ రెండు గోల్స్‌తో బ్రెజిల్ తరఫున 77 గోల్స్ కొట్టిన పీలే రికార్డును నెయ్మర్ బద్దలు కొట్టాడు.
‘బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్‌తో కింగ్‌ను దాటేసినందుకు నీకు కంగ్రాట్స్. పీలే బతికి ఉంటే ఈరోజు నిన్ను ఎంతో అభినందించేవాడు’ అని పీలే కుటుంబ సభ్యులు ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. పీలే రికార్డును బ్రేక్ చేయడంపై నెయమర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘దిగ్గజ ఫుట్‌బాలర్ రికార్డు బ్రేక్ చేస్తానని కలలో కూడా అనుకోలేదు. అయితే.. నేను పీలే కంటే గొప్ప ఆటగాడిని కాదనే విషయం చెప్పాలనుకుంటున్నా. జాతీయ జట్టులో బ్రెజిల్ ఫుట్‌బాల్‌పై చెరగని ముద్ర వేయాలనేది నా కోరిక. ఈరోజు అది చేసి చూపించాను’ అని ఈ స్టార్ ఆటగాడు తెలిపాడు.
బ్రెజిల్, బొలీవియా మ్యాచ్ హైలైట్స్
నెయ్మర్ డబుల్ గోల్‌తో బ్రెజిల్ 5-1తో బొలీవియాపై విజయం సాధించింది. తర్వాత జరిగే రెండో రౌండ్లో పెరూతో తలపడనుంది. నెయ్మర్ ఈమధ్యే సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్(Al Hilal) క్లబ్‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. బ్రెజిల్ తరఫున ఈ యంగ్ ఫుట్‌బాలర్ ఇప్పటివరకూ 125 మ్యాచ్‌లు ఆడాడు. 2013లో కాన్ఫిడెరేషన్స్ కప్ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. నిరుడు ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో నెయ్మర్ బ్రెజిల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే.. ఈ మెగా టోర్నీలో ఆ జట్టు సెమీస్‌లోనే క్రోయేషియా(Croatia) చేతిలో ఓటమితో ఇంటిదారి పట్టింది.
ఇవి కూడా చదవండి
Shaheen Afridi | నా అత్యుత్తమ ప్రదర్శన బాకీ ఉంది.. భారత ఆటగాళ్లకు పాక్ పేసర్ హెచ్చరిక
Vekatesh Prasad | అది పూర్తిగా సిగ్గులేని పని.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు రిజర్వ్ డేపై వెంకటేశ్ ప్రసాద్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

