Oscar Pistorius | ప్రియురాలి హత్య కేసు.. పెరోల్‌కు దరఖాస్తు చేసిన పారా ఒలింపిక్ విజేత
Oscar Pistorius : దక్షిణాఫ్రికా మాజీ పారా అథ్లెట్, ఒలింపిక్ విజేత ఆస్కార్ ప్రిస్టోరియస్(Oscar Pistorius) పెరోల్(Perole) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రియురాలి హత్య కేసులో ఊచలు లెక్క పెడుతున్న అతను రేపు కోర్టు విచారణకు హాజరు కానున్నాడు. బ్లేడ్ రన్నర్‌గా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ప్రిస్టోరియస్ 2013లో గర్ల్ ఫ్రెండ్ రీవా స్టీన్‌కాంప్‌ను తుపాకీతో కాల్చి చంపాడు.
Oscar Pistorius : దక్షిణాఫ్రికా మాజీ పారా అథ్లెట్, ఒలింపిక్ విజేత ఆస్కార్ ప్రిస్టోరియస్(Oscar Pistorius) పెరోల్(Perole) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రియురాలి హత్య కేసులో జైలులో ఊచలు లెక్క పెడుతున్న అతను రేపు కోర్టు విచారణకు హాజరు కానున్నాడు. అటెరిడ్జ్ విల్లె(Atteridgeville prison) జైలులోని పెరోల్ బోర్డ్ అతని అభ్యర్థనను పరిశీలించనుంది. ఇప్పటికే సగం శిక్ష కాలం పూర్తి చేసుకున్న ప్రిస్టోరియస్ను విడుదల చేస్తారా? లేదా? అనేది మరికొన్ని గంటల్లో తెలియనుంది.
ప్రిస్టోరియస్కు పెరోల్ ఇవ్వడాన్ని అతని గర్ల్ ఫ్రెండ్ రీవా స్టీన్కాంప్(Reeva Steenkamp) తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు తమ కూతురును అతను కావాలనే హత్య చేశాడని స్టీన్కాంప్స్ తల్లి జూనె అంటోంది. ‘నా బిడ్డను ఉద్దేశపూర్వకంగానే చంపానని ఒప్పుకో అని నేను ప్రిస్టోరియస్తో చెప్పాను. కానీ, అతను మాత్రం తన కట్టుకథకే కట్టుబడి ఉన్నాడు. మేము కోరుకునేది ఒక్కటే.. నేనే కోపంతో స్టీన్‌కాంప్‌ను కాల్చానని అతను ఇప్పటికైనా ఒప్పుకోవాలి’ అని ఆమె డిమాండ్ చేసింది.
బ్లేడ్ రన్నర్‌గా స్ఫూర్తి
జన్యులోపం (congenital defect) కారణంగా 11 నెలల వయసులోనే ప్రిస్టోరియస్ రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. అయినా కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా బ్లేడ్ రన్నర్(Blade Runner)గా రాణించాడు. తన అసమాన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. పారా అథ్లెట్‌గా ఒలింపిక్స్‌లో పతకాలు కొల్లగొట్టాడు. అలాంటిది లా స్టూడెంట్, మోడల్ అయిన గర్ల్ ఫ్రెండ్ రీవా స్టీన్‌కాంప్‌ను 2013లో హత్య చేసి ఒక్కసారగా పాతాళానికి పడిపోయాడు. ప్రిటోరియాలోని తన సొంత ఇంటిలో అతను ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. అయితే.. తాను కావాలని ఆమెను హత్య చేయలేదని, దొంగ అనుకొని పొరబడి బాత్రూమ్ డోర్ నుంచి తనను కాల్చానని నమ్మబలికాడు. కానీ, అతడి మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో కోర్టు అతనికి 13 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ఇవి కూడా చదవండి
IPL 2023 | ఈ సీజన్లో రోహిత్ నాలుగో స్థానంలో ఆడాలి.. ఎందుకంటే..? అనిల్ కుంబ్లే
IPL 2023 | మా కెప్టెన్ ఒక మెషిన్.. అతనొక అద్భుతమైన క్రికెటర్ : మయాంక్ అగర్వాల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

