Hardik Pandya | షమీని తిట్టాడని పాండ్యాపై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే?
టీ20 క్రికెట్ అంటే నిమిషంలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు తప్పులు జరగడం సహజం. సరిగ్గా ఇలాగే జరిగింది సోమవారం నాటి సన్‌రైజర్స్, గుజరాత్ మ్యాచ్‌లో. సన్‌రైజర్స్ ఛేజింగ్ సమయంలో కీలక బ్యాటర్ రాహుల్ త్రిపాఠీ.. పాండ్యా వేసిన షార్ట్‌బాల్‌ను కట్ చేయడానికి ట్రై చేశాడు. సరిగా కనెక్ట్ కాకపోవడంతో డీప్ థర్డ్ మ్యాన్‌లో ఉన్న షమీ వైపు బంతి వెళ్లింది.
అయితే ముందుకొచ్చి క్యాచ్ పట్టడం కష్టమని భావించిన షమీ.. వెనుకే ఉండి బౌండరీ సేవ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. బౌండరీ వెళ్లకుండా ఆపాడు కూడా. కానీ షమీ నిర్ణయం కెప్టెన్ పాండ్యాకు నచ్చలేదు. అదే ఓవర్ ఆరంభంలో సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. చివరి బంతికి వచ్చిన అవుట్ అవకాశాన్ని షమీ వదిలేయడంతో చిరాకు పడిన పాండ్యా.. షమీపై కోపంగా అరిచాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఒక సీనియర్ ప్లేయర్‌తో ఇలాగే ప్రవర్తిస్తారా? మ్యాచ్‌లో టెన్షన్ పెరిగితే పాండ్యా ఎప్పుడూ ఎవరో ఒకరిపై అరుస్తుంటాడని తిట్టిపోస్తున్నారు. అంతకుముందు మ్యాచ్‌లో కూడా సౌతాఫ్రికా వెటరన్ డేవిడ్ మిల్లర్‌ను రన్‌కు పిలిచి, అతని రనౌట్ అయితే పాండ్యా అసహనం వ్యక్తం చేయడాన్ని ఎత్తి చూపుతున్నారు.
ఇంత దారుణంగా ప్రవర్తించే వ్యక్తి కెప్టెన్‌గా పనికిరాడంటూ తిట్టిపోస్తున్నారు. అయితే కామెంటేటర్ గ్రేమ్ స్వాన్ మాత్రం పాండ్యాకు మద్దతిచ్చాడు. షమీ క్యాచ్ పట్టడానికి ప్రయత్నించాల్సిందని సూచించాడు.
Dear Hardik, you are a terrible captain. Stop taking it out on your teammates, particularly someone as senior as Shami. #IPL #IPL2022 #GTvsSRH pic.twitter.com/9yoLpslco7
— Bodhisattva #DalitLivesMatter 🇮🇳🏳️🌈 (@insenroy) April 11, 2022
@hardikpandya7 shouting at the #mohammedshami is disgraceful what Shami has done for #Indianteam is commendable and #Hardik has not even done half of it. #shameful #HardikPandya
— @VickyUnfiltered (@Vicky_Unfilter) April 11, 2022
Can’t believe Hardik Pandya just insulted senior player and an Indian legend Mohd. Shami for not taking the risky catch and preferred to save the boundary. Hardik’s temper tantrums during tight situations have been outright cringe. #GTvsSRH #IPL2022 pic.twitter.com/yAyMmFkRwS
— Monarch (@glowred) April 11, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

