Vinod Kambli |టీం ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీని ఆదివారం ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని బంద్రాలో గల తన రెసిడెన్షియల్ సొసైటీ గేటు మీదుగా కారు నడిపించినందుకు కేసు నమోదైంది. ఈ సందర్భంగా కాంప్లెక్స్ వాచ్మెన్, కొందరు నివాసులతో వాగ్వాదానికి దిగాడన్న ఆరోపణలు ఉన్నాయి.
వినోద్ కాంబ్లీపై ఐపీసీలోని 279, 336, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు బంద్రా పోలీసులు తెలిపారు. తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ అభిమాన క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు వినోద్ కాంబ్లీ అత్యంత సన్నిహితుడు.