ODI World Cup 2023 | న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. వరల్డ్ కప్ నుంచి స్టార్ పేసర్ ఔట్
ODI World Cup 2023 : వన్డే ప్రపంచ కప్‌లో సెమీస్ బెర్తుపై కన్నేసిన న్యూజిలాండ్‌కు ఊహించని పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ(Matt Henry) మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఈ...
ODI World Cup 2023 : వన్డే ప్రపంచ కప్‌లో సెమీస్ బెర్తుపై కన్నేసిన న్యూజిలాండ్‌కు ఊహించని పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ(Matt Henry) మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. కుడిచేతికి గాయం కారణంగా భారత్‌లో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ నుంచి మ్యాట్ హెన్రీ వైదొలిగాడు.
అతడి స్థానంలో కైలీ జేమీసన్‌ను తీసుకున్నాం అని న్యూజిలాండ్ క్రికెట్ ట్విట్టర్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. నవంబర్ 1న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 6వ ఓవర్ వేస్తున్న సమయంలో హెన్రీ గాయపడ్డాడు. నొప్పి తట్టుకోలేక కుప్పకూలిన అతడిని సిబ్బంది డగౌట్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత బౌలింగ్‌కు రాలేదు.
Matt Henry has been ruled out of the @cricketworldcup with a torn right hamstring and has been replaced in the squad by Kyle Jamieson. An MRI scan confirmed he has a grade two lower tear which will require at least 2 to 4 weeks to recover from. #CWC23 https://t.co/HXmethEthZ
— BLACKCAPS (@BLACKCAPS) November 3, 2023
దాంతో, జిమ్మీ నీషం ఓవర్ పూర్తి చేశాడు. స్కానింగ్ పరీక్షలో హెన్రీ కుడిచేతికి తీవ్ర గాయం అయినట్టు తేలింది. కోలుకునేందుకు నాలుగు వారాలపైనే పట్టనుందని వైద్యులు చెప్పారు. దాంతో, కివీస్ బోర్డు బ్యాకప్ బౌలర్‌గా కైలీ జేమీసన్‌ను ఎంపిక చేసింది. అతడు గురువారం బెంగళూరులో జట్టుతో కలిశాడు.

శ్రీలంకపై భారీ విజయంతో టీమిండియా సెమీస్ బెర్తు ఖరారు చేసుకోగా.. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 7 మ్యాచుల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన బ్లాక్‌కాప్స్ .. శనివారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది.
ఇవి కూడా చదవండి
Novak Djokovic | ప్యారిస్ మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్లో జకోవిచ్
Anand Mahindra | శ్రీలంకపై భారత్ సూపర్ విక్టరీ.. మన బౌలర్లు లంకను భయబ్రాంతులకు గురిచేశారన్న మహీంద్రా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

