PV Sindhu | క్రికెట్ ఎక్స్పర్ట్ గా మారిన పీవీ సింధు.. అఫ్గాన్-పాక్ పోరుపై కామెంట్స్
PV Sindhu | వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా సోమవారం పాకిస్తాన్ –అఫ్గానిస్తాన్ మధ్య ముగిసిన మ్యాచ్‌లో అఫ్గాన్ జట్టు సంచలన విజయం అనంతరం సింధు.. ఈ మ్యాచ్‌పై ట్వీట్ చేయడం విశేషం.
PV Sindhu | భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు క్రికెట్ ఎక్స్పర్ట్ గా మారింది. వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా సోమవారం పాకిస్తాన్ –అఫ్గానిస్తాన్ మధ్య ముగిసిన మ్యాచ్‌లో అఫ్గాన్ జట్టు సంచలన విజయం అనంతరం సింధు.. ఈ మ్యాచ్‌పై ట్వీట్ చేయడం విశేషం. అఫ్గాన్ జట్టును ఇక నుంచి ఎంత పెద్ద జట్టు అయినా తేలికగా తీసుకోకూడదని.. వాళ్లకు నాణ్యమైన ముగ్గురు స్పిన్నర్లతో పాటు మెరుగైన బ్యాటర్లూ ఉన్నారని తెలిపింది. పాక్-అఫ్గాన్ మ్యాచ్ తర్వాత ఆమె ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
పాకిస్తాన్‌పై అఫ్గాన్ విజయం తర్వాత ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్విటర్ లో స్పందిస్తూ.. ‘వావ్ అఫ్గానిస్తాన్. ఆ జట్టు క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్‌పై విజయం గొప్పది కావొచ్చు. కానీ నేటి మ్యాచ్‌లో ఛేదన మాత్రం అంతకుమించి ఉంది. ఇకనుంచి వాళ్లను సీరియస్ గా తీసుకోండి. ఎందుకంటే నేటి ఆటలో ఆ జట్టు బ్యాటర్లు చూపిన పరిణితి ఆకట్టుకుంది. ఇంగ్లాండ్‌పై విజయం కంటే నేనైతే నేటి విజయానికే ఓటేస్తా..’అని రాసుకొచ్చాడు.
సింధు ఇదే ట్వీట్‌ను షేర్ చేస్తూ.. ‘ఫ్రెంచ్ ఓపెన్ ఆడేందుకు వెళ్లడానికి ముందు కొంతసేపు ఈ మ్యాచ్ చూశాను. అఫ్గాన్‌తో ఆడేప్పుడు ప్రతి జట్టూ ఆందోళన చెందాల్సిందే. ప్రపంచంలో ఎలాంటి బ్యాటింగ్ లైనప్‌ను అయినా బోల్తా కొట్టించే స్పిన్నర్లు ఆ జట్టు సొంతం. వాళ్ల బ్యాటింగ్ మెచ్యూరిటీ కూడా అద్భుతంగా ఉంది..’ అని రాసుకొచ్చింది.
ఏడు నెలల తర్వాత టాప్-10లోకి…
బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో సింధు మళ్లీ టాప్-10లోకి వచ్చింది. ఏడు నెలల తర్వాత ఆమె టాప్ -10లోకి దూసుకొచ్చింది. ఇటీవలే ముగిసిన అర్క్టిక్ ఓపెన్ తో పాటు డెన్మార్క్ ఓపెన్‌లో కూడా సెమీస్‌కు చేరినందుకు గాను ఆమె ర్యాంకు మెరుగుపడింది. మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఆమె రెండు స్థానాలను మెరుగుపరుచుకుని పదో స్థానానికి చేరింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

