క్రికెట్‌కు మోర్గాన్ వీడ్కోలు
- అంతర్జాతీయ కెరీర్‌కు ఫుల్స్టాప్
లండన్: ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్పై వస్తున్న వార్తలను నిజం చేస్తూ ఆట నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించాడు. గత కొంతం కాలంగా గాయాలతో సహవాసం చేస్తున్న మోర్గాన్.. ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. 2006లో ఐర్లాండ్ తరఫున స్కాట్లాండ్తో వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన 35 ఏండ్ల ఇయాన్..నెదర్లాండ్స్‌తో ఆఖరి మ్యాచ్ ఆడాడు. తనదైన నాయకత్వ పటిమతో ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో మోర్గాన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న ఇంగ్లిష్ జట్టుకు దూకుడు పరిచయం చేశాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టే రీతిలో జట్టును తీర్చిదిద్దడంలో కీలక భూమిక పోషించాడు. ప్రత్యర్థి ఎవరైనా లెక్కచేయని నైజంతో విజయాలు సాధించడంలో సఫలమయ్యాడు. ఎన్నో ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్‌ను విజేతగా నిలిపి తన సత్తా ఏంటో చాటిచెప్పాడు.
మోర్గాన్ కెరీర్:
వన్డేలు: 248, పరుగులు: 7701, సగటు: 39.29 టీ20లు: 115, పరుగులు: 2458, సగటు: 28.58
టెస్టులు: 16, పరుగులు: 700, సగటు: 30.43
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

