లండన్ : ఇంగ్లండ్ మాజీ కెప్లెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ఒక కారు ప్రమాదంలో గాయపడడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. బిబిసికి సంబంధించి ఒక టీవీ షో ఎపిసోడ్ షూటింగ్ సందర్భంగా అతడు నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. వెంటనే అతడిని హెలికాప్టర్లో అస్పత్రికి తరలించినట్టు బిబిసి యాజమాన్యం తెలిపింది. అయితే ఫ్లింటాఫ్ ప్రాణానికి ప్రమాదం లేదని తెలిపింది.
షూటింగ్ సందర్భంగా అన్ని జాగ్రత్తలు పాటించామని, తీవ్ర గాయాలేమీ కాలేదని బిబిసి తెలిపింది. మూడేళ్ల క్రితంకూడా ఫ్లింటాఫ్ షూటింగ్ సందర్భంగా కారు ప్రమాదంనుంచి తప్పించుకున్నాడు.