Nizamabad | నోళ్లు తెరిచిన డ్రైనేజీలు.. కంపు కొడుతున్న ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణ..!
Nizamabad : నిజామాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రుల అవరణ అపరిశుభ్రతకు కేరాఫ్‌గా మారింది. నిత్యం వందలాది మందికి ఆరోగ్య సేవలందించే జనరల్ ఆస్పత్రి (Govt General Hospital), మాతా శిశు సంక్షేమ ఆస్పత్రి(Mata Shishi Samkshema Hospital) ప్రాంగణంలో దుర్గంధం వ్యాపిస్తోంది.
Nizamabad : నిజామాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రుల అవరణ అపరిశుభ్రతకు కేరాఫ్‌గా మారింది. నిత్యం వందలాది మందికి ఆరోగ్య సేవలందించే జనరల్ ఆస్పత్రి (Govt General Hospital), మాతా శిశు సంక్షేమ ఆస్పత్రి(Mata Shishi Samkshema Hospital) ప్రాంగణంలో దుర్గంధం వ్యాపిస్తోంది. బయట అడుగుపెడితే కంపు కొట్టే మురుగు కాలువ. దాంతో, కాన్పు కోసం, వైద్య పరీక్షల కోసం దవాఖానకు వచ్చిన గర్భిణులు, వారి సహాయకులు దోమలతో వేగలేకపోతున్నారు
మాతా శిశు సంక్షేమ ఆస్పత్రిలో సేవలు భేషుగ్గా ఉన్నా పరిసరాలు, ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణ మాత్రం అధ్వాన్నంగా ఉంది. ప్రధాన గేటుకు ఇరువైపులా ఓపెన్ డ్రైనేజ్, పారుతున్న ముసుగుతో ఆస్పత్రిలో దోమల బెడద.. భరించలేని దుర్వాసన. పైగా టాయిలెట్లు లేకపోవడంతో ఆవరణంతా అపరిశుభ్రతకు అద్దం పడుతోంది. చినకు పడిందంటే పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతోంది.
మాతా శిశు సంక్షేమ ఆస్పత్రి ప్రాంగణం

ఇక ప్రధాన బస్టాండ్, ప్రభుత్వ జనరల్ దవాఖానా ముందర కూడా దాదాపూ ఇదే పరిస్థితి. అదమరిచి అడుగేస్తే అంతే అన్నట్టుగా.. మూతలు లేని డ్రైనేజ్‌లు భయపెడుతున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇరువైపులా..

సరైన మూతల్లేని డ్రైనేజీ.. జీజీహెచ్‌లో తాగు నీటి పక్కనే మురుగు

Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

