Alex Hales | క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ విధ్వంసక ఓపెనర్
Alex Hales : ఇంగ్లండ్ విధ్వంసక ఓపెనర్(England Opener) అలెక్స్ హేల్స్(Alex Hales) అంతర్జాతీయ క్రికెట్(International Cricket)కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 స్పెషలిస్ట్‌గా పేరొందిన అతను ఈరోజుతో మూడు ఫార్మాట్లకు ముగింపు పలికాడు. దాంతో, అతడి 12 ఏళ్ల కెరీర్ ముగిసింది. అలెక్స్ ఇకపై ఫ్రాంచైజ్ క్రికెట్(Franchise Cricket)లో....
Alex Hales : ఇంగ్లండ్ విధ్వంసక ఓపెనర్(England Opener) అలెక్స్ హేల్స్(Alex Hales) అంతర్జాతీయ క్రికెట్(International Cricket)కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 స్పెషలిస్ట్‌గా పేరొందిన అతను ఈరోజుతో మూడు ఫార్మాట్లకు ముగింపు పలికాడు. దాంతో, అతడి 12 ఏళ్ల కెరీర్ ముగిసింది. అలెక్స్ ఇకపై ఫ్రాంచైజ్ క్రికెట్(Franchise Cricket)లో సత్తా చాటాలని భావిస్తున్నాడు. నిరుడు టీ20 వరల్డ్ కప్(T20 World Champion) గెలిచిన ఇంగ్లండ్ జట్టులో అలెక్స్ సభ్యుడు.
విధ్వంసక ఆటగాడిగా పేరొందిన అలెక్స్ హేల్స్ 2011లో భారత్‌పై టీ20ల్లో అరంగేట్రం చేశాడు. పొట్టి క్రికెట్లో సంచలన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న అలెక్స్ ఆ తర్వాత వన్డే జట్టులోకి వచ్చాడు. అయితే.. టీ20ల్లోనే బాగా సక్సెస్ అయ్యాడు. కొన్ని రోజులు ఈ ఫార్మాట్లో వరల్డ్ నంబర్ 1 బ్యాటర్( No. 1 T20 batter)గా కొనసాగాడు.
అలెక్స్ హేల్స్

ఇంగ్లండ్ జట్టు వన్డేల్లో నమోదుచేసిన రెండు అత్యధిక స్కోర్లలో అలెక్స్ పాత్ర ఉంది. 2022లో పాకిస్థాన్‌పై సెంచరీ(171)తో కదం తొక్కాడు. 2018లో ఆస్ట్రేలియాపై 147 పరుగులతో అదరగొట్టాడు. దాంతో, ఇంగ్లండ్ 498 పరుగుల భారీ స్కోర్ చేసింది.
టీ20 ట్రోఫీని ముద్దాడుతున్న అలెక్స్

ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చిన 2022 టీ20 వరల్డ్ కప్‌లో జోస్ బట్లర్ సేన ఫైనల్‌కు దూసుకెళ్లంలో అలెక్స్ కీలక పాత్ర పోషించాడు. భారత జట్టుతో జరిగిన సెమీఫైనల్లో ఈ చిచ్చర పిడుగు 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటివరకూ ఇంగ్లండ్ తరఫున అలెక్స్ 75 టీ20లు, 70 వన్డేలు, 11 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. జాతీయ జట్టుకంటే ఫ్రాంచైజీ క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఈ ఏడాది ఆరంభంలో పాకిస్థాన్ సూపర్ లీగ్(Pakistan Super League)లో ఆడడం కోసం అతను బంగ్లాదేశ్ పర్యటన నుంచి తప్పుకున్నాడు.
ఇవి కూడా చదవండి
Gukesh D | భారత చెస్ దిగ్గజం రికార్డు బద్ధలు.. నంబర్ 1 ర్యాంక్ దక్కించుకున్న యంగ్ గ్రాండ్‌మాస్టర్
Virat Kohli | కోహ్లీ కెప్టెన్సీ అట్లుంటది.. స్టార్ ఆటగాళ్లను కూడా పక్కన పెట్టేశాడు!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

