McCullam | భారత్‌తో టెస్టు సిరీస్ మాకు పెద్ద సవాల్ : మెక్కల్లమ్
McCullam : వన్డే ప్రపంచకప్ సమరం ముగియడంతో అన్ని జట్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) ఫైనల్ బెర్తు మీద కన్నేశాయి. డబ్ల్యూటీసీ 2023-25 రెండో సైకిల్లో భారత జట్టు(Team Inida).. బలమైన దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌తో తలపడనుంది. గత ఏడాది కాలంగా బజ్‌బాల్(Bazz Ball) ఆటతో ఇంగ్లండ్ జట్టు టెస్టు క్రికెట్‌ను....
McCullam : వన్డే ప్రపంచకప్ సమరం ముగియడంతో అన్ని జట్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) ఫైనల్ బెర్తు మీద కన్నేశాయి. డబ్ల్యూటీసీ 2023-25 రెండో సైకిల్లో భారత జట్టు(Team Inida).. బలమైన దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌తో తలపడనుంది. గత ఏడాది కాలంగా బజ్‌బాల్(Bazz Ball) ఆటతో ఇంగ్లండ్ జట్టు టెస్టు క్రికెట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేసిన విషయం తెలిసిందే. యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను నిలువరించిన ఇంగ్లీష్ జట్టు వచ్చే ఏడాది జనవరంలో భారత పర్యటనకు రానుంది. అయితే.. ఈ టూర్‌కు నెల రోజుల ముందు ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లం(Brendon McCullam) సంచలన వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియాతో టెస్టు సిరీస్ తమకు పెద్ద సవాల్ అని మెక్కల్లం అన్నాడు. ‘భారత్‌తో టెస్టు సిరీస్ ఇంగ్లండ్‌కు పెద్ద ఛాలెంజ్. ఆ సిరీస్ కోసం నేను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఎందుకంటే.. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుతో మేము పోటీ పడనున్నాం. సొంత గడ్డపై టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన చేస్తుందని నేను బలంగా నమ్ముతున్నా’ అని మెక్కల్లం వెల్లడించాడు.

బెన్ స్టోక్స్(Ben Stokes) నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు జనవరిలో భారత పర్యటనకు రానుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య జనవరి 25వ తేదీన హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్టు జరుగనుంది. ఆ తర్వాతి మ్యాచ్‌లకు వరుసగా విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాల వేదిక కానున్నాయి.

న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్ అయిన మెక్కల్లం 2022లో ఇంగ్లండ్ టెస్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. సరిగ్గా అప్పుడే జో రూట్ నుంచి బెన్ స్టోక్స్ పగ్గాలు అందుకున్నాడు. అంతే.. అప్పటివరకూ సంప్రదాయా క్రికెట్‌కే పరిమితమైన ఇంగ్లండ్ ఆటగాళ్ల బ్యాటింగ్ శైలి ఒక్కసారిగా మారిపోయింది. టెస్టులను సైతం వన్డే మాదిరిగా ఆడడం మొదలెట్టారు. దాంతో, ఇంగ్లండ్ జట్టుకు దూకుడు నేర్పిన మెక్కల్లం నిక్‌నేమ్ బజ్‌తో.. స్టోక్స్ సేన ఆటకు బజ్‌బాల్ పేరు స్థిరపడిపోయింది.
ఇవి కూడా చదవండి
T20 Series | ఇంగ్లండ్‌తో రేపే పొట్టి సిరీస్.. నెట్స్‌లో చెమటోడ్చిన హర్మన్‌ప్రీత్ సేన
Ganguly-Kohli Row: కోహ్లీని కెప్టెన్సీ నుంచి నేను తొలగించలేదు: దాదా షాకింగ్ కామెంట్స్
Pakistan Cricketer | అన్నను మించిపోయేలా ఉన్నాడే.. పాక్ యువ పేసర్ యార్కర్ వీడియో వైరల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

