Hamza Shaikh | కీపర్‌కు బంతి ఇచ్చినందుకు ఔట్.. షాక్‌లో బ్యాటర్.. వీడియో
Hamza Shaikh : అండర్ -19 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ ఆటగాడు అనూహ్యరీతిలో ఔటయ్యాడు. ఫీల్డింగ్ జట్టు వికెట్ కీపర్‌కు సాయం చేయబోయిన హమ్జా షేక్(Hamza Shaikh) నిరాశగా పెవిలియన్ చేరాడు. అసలే ఏం జరిగిందంటే.....
Hamza Shaikh : అండర్ -19 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ ఆటగాడు అనూహ్యరీతిలో ఔటయ్యాడు. ఫీల్డింగ్ జట్టు వికెట్ కీపర్‌కు సాయం చేయబోయిన హమ్జా షేక్(Hamza Shaikh) నిరాశగా పెవిలియన్ చేరాడు. అసలే ఏం జరిగిందంటే.. సూపర్ సిక్స్ స్టేజ్‌లో భాగంగా శనివారం జింబాబ్వే, ఇంగ్లండ్ తలపడ్డాయి. రియాన్ సింబీ (Ryan Simbi) వేసిన 17వ ఓవర్లో హమ్జా బంతిని డిఫెన్స్ చేశాడు. ఆ బంతి వికెట్లకు దగ్గర పడింది. స్టంప్స్ వెనకాల ఉన్న రియాన్ కమ్వెంబా బంతిని తీసుకునేందుకు వస్తుండగానే హమ్జా చేత్తో బంతిని పట్టుకొని అతడికి ఇచ్చాడు.
అది చూసిన బౌలర్ అప్పీల్ చేశాడు. దాంతో, ఫీల్డింగ్‌కు అంతరాయం కలిగించాడనే నెపంతో ఆన్‌ఫీల్డ్ అంపైర్, థర్డ్ అంపైర్లు హమ్జాను ఔట్‌గా ప్రకటించాడు. ఊహించని పరిణామంతో, హమ్జా ఒక్కసారిగా షాకయ్యాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Out for obstructing the field 😂😂 #Cricket
pic.twitter.com/WVZtLEMRfc— Cow Corner (@CowCorner183) February 3, 2024
బంగ్లాదేశ్ సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం(Mushfiqur Rahim) కూoడా అచ్చం ఇలానే ఔటై వార్తల్లో నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అతడు వికెట్ల వైపు వస్తున్న బంతిని చేత్తో అడ్డుకొన్నాడు. దాంతో, అతడిని ఔట్‌గా ప్రకటించారు.
ఎంసీసీ చట్టం 37.4 ప్రకారం ఏ బ్యాటర్ అయినా బంతిని చేత్తో ముట్టుకోవడం, శరీరంతో అడ్డుకోవడం వంటివి చేయడం నేరం. సదరు ఫీల్డర్ అంగీకారం లేకుండా బంతిని అలా ముట్టుకుంటే ఔట్‌గా ప్రకటించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
- IND vs ENG 2nd Test | శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ.. భారీ ఆధిక్యంలో టీమిండియా
- Bhuvanagiri | ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య.. భువనగిరి తీవ్ర ఉద్రిక్తత
- Gunturu Kaaram | మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి రాబోతున్న ‘గుంటూరు కారం’
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

