Zak Crawley | లార్డ్స్ టెస్టులో 150 పరుగులతో ఆసీస్‌ను ఓడించడం ఖాయం : ఇంగ్లండ్ ఓపెనర్
Zak Crawley : యాషెస్ సిరీస్(Ashes Series)లో ఆతిథ్య ఇంగ్లండ్ 0-1తో వెనకబడ్డ విషయం తెలిసిందే. అందుకని లార్డ్స్ వేదికగా జరిగే రెండో టెస్టులో గెలుపే లక్ష్యంగా బెన్ స్టోక్స్ సేన బరిలోకి దిగనుంది. తాజాగా ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే( Zak Crawley) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లార్డ్స్ టెస్టులో తమ జట్టు 150 పరుగుల తేడాతో...
Zak Crawley : యాషెస్ సిరీస్(Ashes Series)లో ఆతిథ్య ఇంగ్లండ్ 0-1తో వెనకబడ్డ విషయం తెలిసిందే. అందుకని లార్డ్స్ వేదికగా జరిగే రెండో టెస్టులో గెలుపే లక్ష్యంగా బెన్ స్టోక్స్ సేన బరిలోకి దిగనుంది. రెండో టెస్టులో మరింత దూకుడుగా ఆడతామని ఆ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్(brendon mccullum) ఇప్పటికే ప్రకటించాడు. తాజాగా ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే( Zak Crawley) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లార్డ్స్ టెస్టులో తమ జట్టు 150 పరుగుల తేడాతో గెలుస్తుందని అన్నాడు.
టైమ్స్ రేడియో(Times Radio)తో మాట్లాడిన అతను.. ‘తొలి టెస్టులో ఓటమి మా జట్టు స్థైర్యాన్ని దెబ్బతీయలేదు. ఇంగ్లండ్ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఊహించాడు. లార్డ్స్ పిచ్ మా ఆటకు బాగా సరిపోతుంది. అందుకని మా జట్టు గెలుస్తుందని అనుకుంటున్నా. అయితే.. ఎంత తేడాతో అనేది తెలియదు. 150 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడిస్తామని అనిపిస్తోంది’ అని క్రాలే తెలిపాడు. ఎడ్జ్‌బాస్టన్ (Edgebaston) టెస్టులో క్రాలే మొదటి ఇన్నింగ్స్‌లో (61) హాఫ్ సెంచరీతో రాణించాడు. జూన్ 28న రెండో టెస్టు మొదలవ్వనుంది. ఈ మ్యాచ్‌లో మోయిన్ అలీ ప్లేస్‌లో లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌ను ఆడించే అవకాశం ఉంది.
తొలి టెస్టులో కమిన్స్ విజయానందం

ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ సంచలన విజయం సాధించింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(44 నాటౌట్), నాథన్ లియాన్(16 నాటౌట్) అసమాన పోరాటం చేశారు. వీళ్లు 9వ వికెట్‌కు 55 రన్స్ జోడించారు. దాంతో, ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.తొలి టెస్టు మొదటి రోజు బెన్ స్టోక్స్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి పెద్ద మూల్యమే చెల్లించాడు.
ఇవి కూడా చదవండి
WI vs ZIM | వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్.. వెస్టిండీస్‌కు షాకిచ్చిన జింబాబ్వే
Christian Roberto | హై హీల్స్‌తో పరుగెత్తి.. 100 మీటర్ల రేసులో గిన్నిస్ రికార్డు సాధించాడు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

