ENG vs PAK: దంచికొట్టిన ఇంగ్లండ్.. హుగ్లీ నదిలో కలిసిన పాక్ సెమీస్ ఆశలు
ENG vs PAK: టోర్నీ ఆసాంతం అత్యంత చెత్త బ్యాటింగ్‌తో విఫలమైన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో దంచికొట్టి బాబర్ సేన ఆశలపై భారీ వర్షమే కురిపించింది.
ENG vs PAK: వరల్డ్ కప్ సెమీస్ రేసులో నిలవాలంటే భారీ విజయం సాధించాల్సిన పాకిస్తాన్‌కు ఇంగ్లండ్ షాకిచ్చింది. టాస్ గెలిచినప్పుడే పాకిస్తాన్ సెమీస్ ఆశలు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌కు సమీపంలోనే పారుతున్న హుగ్లీ నదిలో కలవగా.. తాజాగా టోర్నీ ఆసాంతం అత్యంత చెత్త బ్యాటింగ్‌తో విఫలమైన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో దంచికొట్టి బాబర్ సేన ఆశలపై భారీ వర్షమే కురిపించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇప్పుడు ఈ టార్గెట్‌ను పాకిస్తాన్ 6.1 ఓవర్లలోపు ఛేదించాలి. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన పాక్.. ఈ మ్యాచ్‌లో గెలిచినా ఓడినట్టే..!
ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌కు శుభారంభమే దక్కింది. ఈ టోర్నీ మొత్తం విఫలమైన జానీ బెయిర్ స్టో (61 బంతుల్లో 59, 7 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మలన్ (39 బంతుల్లో 31, 5 ఫోర్లు) లు తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించారు. వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌కు ఇదే బెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్ షిప్ కావడం గమనార్హం. ధాటిగా ఆడుతున్న ఈ జోడీని ఇఫ్తికార్ విడదీశాడు. ఇఫ్తికార్.. మలన్‌ను ఔట్ చేయగా బెయిర్ స్టోను హరీస్ రౌఫ్ పెవిలియన్ చేర్చాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్ (76 బంతుల్లో 84, 11 ఫోర్లు, 2 సిక్సర్లు౦, జో రూట్ (72 బంతుల్లో 60, 4 ఫోర్లు) మూడో వికెట్‌కు 132 పరుగులు జోడించారు. ఈ ఇద్దరూ రన్ రేట్ ఆరుకు పడిపోకుండా జాగ్రత్తపడ్డారు. స్టోక్స్ దూకుడుగా ఆడగా రూట్ నిదానంగా బ్యాటింగ్ చేశాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో స్టోక్స్‌ను షాహిన్ అఫ్రిది 40వ ఓవర్లో తొలి బంతికే బౌల్డ్ చేశాడు. రూట్ రనౌట్ అయ్యాడు. ఆఖర్లో జోస్ బట్లర్ (18 బంతుల్లో 27, 3 ఫోర్లు, 1 సిక్సర్), హ్యారీ బ్రూక్ (17 బంతుల్లో 30, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ విల్లే (5 బంతుల్లో 15, 2 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడి ఇంగ్లండ్ స్కోరును 330 మార్కు దాటించారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ మూడు వికెట్లు తీయగా షహీన్ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టినా భారీగా పరుగులిచ్చారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

