ENG vs BAN | బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఇంగ్లండ్.. బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యం
ENG vs BAN | వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు పరుగుల వరద పారించింది. బంగ్లాదేశ్ జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముందుగా బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది.
ధర్మశాల: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు పరుగుల వరద పారించింది. బంగ్లాదేశ్ జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముందుగా బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌కు 365 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలాన్ ఇంగ్లండ్‌కు శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి 115 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ దశలో షకీబ్ ఉల్ హసన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో (52; 8 ఫోర్లు) క్లీన్ బౌల్డయ్యాడు. తర్వాత జోయ్ రూట్ వన్ డౌన్‌గా వచ్చి డేవిడ్ మలాన్‌కు జత కలిశాడు. ఈ ఇద్దరు కూడా 151 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తర్వాత మెహదీ హసన్ బౌలింగ్‌లో మరో సెంచరీ హీరో డేవిడ్ మలాన్ (140; 16 ఫోర్లు, 5 సిక్స్‌లు) బౌల్డ్ అయ్యాడు.
అప్పటికి ఇంగ్లండ్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 266 పరుగులు. ఆ తర్వాత భారీ స్కోర్ నమోదు చేసే ప్రయత్నంలో బాదుడే పనిగా పెట్టుకుని ఇంగ్లండ్ బ్యాటర్లు వెంటవెంటనే వికెట్లు పారేసుకున్నారు. జోయ్ రూట్ (68; 8 ఫోర్లు, 1 సిక్సర్) నాలుగో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. షొరీఫుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో ముష్ఫికర్ రహీమ్‌కు క్యాచ్ ఇచ్చి రూట్ ఔటయ్యాడు. నిర్ణీత 50 ఓవర్ల ఆట ముగిసేటప్పటికీ ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ 4 వికెట్లు, షొరీఫుల్ ఇస్లామ్ 3 వికెట్లు తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

