Azharuddin | హెచ్‌సీఏ అక్రమాలపై ఈడీ విచారణ షురూ.. అజర్‌కు నోటీసులు
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వరింగ్ ప్రెసిడెంట్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం నోటీసులు జారీ చేసింది. హెచ్‌సీఏలో రూ.20 కోట్ల మోసంలో విచారణకు హాజరు కావాలని ఈడీ కోరింది.
- ఉప్పల్ పీఎస్‌లో కేసులు, ఏసీబీ ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈసీఆర్
Azharuddin | హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వరింగ్ ప్రెసిడెంట్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం నోటీసులు జారీ చేసింది. హెచ్‌సీఏలో రూ.20 కోట్ల మోసంలో విచారణకు హాజరు కావాలని ఈడీ కోరింది. 2019 నుంచి 2023 వరకు హెచ్‌సీఏలో జరిగిన అక్రమాలపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు ఉన్నాయి. వీటికి తోడు ఉప్పల్ స్టేడియంలో హెచ్‌సీఏ అక్రమాలపై ఏసీబీ అధికారులు సైతం పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వీటి ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఆర్ నమోదు చేశారు.
అజారుద్దీన్ పదవీకాలంలో క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్, జిమ్ పరికరాలకు కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలోనే హెచ్‌సీఏలో అక్రమాలపై ఈడీ నజర్ పెట్టింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో హెచ్‌సీఏలోని అక్రమాలపై విచారణకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. కాగా ఇదే కేసులో మాజీ క్రికెటర్లు అర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్‌ను గత డిసెంబర్లో ఈడీ అధికారులు విచారించారు.
గతంలోనూ విచారణ..
ఇదే రూ.20 కోట్ల అంశానికి సంబంధించి హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌కు ఈడీ అధికారులు గత డిసెంబర్లో నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది జనవరి మొదటి వారంలో ఈడీ ఎదుట హాజరుకావాలని వినోద్‌కు నోటీసులు పంపి, విచారించారు. ఉప్పల్ స్టేడియం మరమ్మతుల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడి నిధులు స్వాహా చేశారని, అవినీతి నిరోధక శాఖ మూడు కేసులు నమోదు చేసింది. ఈ కేసుల ఆధారంగా మనీ లాండరింగ్ చట్టం కింద మరో కేసును నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఇదే వ్యవహారంలో గత నవంబర్‌లో తెలంగాణ వ్యాప్తంగా 9 చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలు, రూ.10,39,000ల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్‌పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

