IPL 2024 | ‘థాంక్యూ సీఎస్కే’.. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ పోస్ట్ వైరల్
IPL 2024 : ఐపీఎల్ 16వ సీజన్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఆరో ట్రోఫీ కోసం కసరత్తు మొదలెట్టింది. ఐపీఎల్ 2024 మినీ వేలానికి కౌంట్‌డౌన్ మొదలవ్వడంతో కొందరు ఆటగాళ్లను విడుదల చేసింది. ఆదివారం దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్(Dwaine Pretorius)ను సీఎస్కే రిలీజ్...
IPL 2024 : ఐపీఎల్ 16వ సీజన్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఆరో ట్రోఫీ కోసం కసరత్తు మొదలెట్టింది. ఐపీఎల్ 2024 మినీ వేలానికి కౌంట్‌డౌన్ మొదలవ్వడంతో కొందరు ఆటగాళ్లను విడుదల చేసింది. ఆదివారం దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్(Dwaine Pretorius)ను సీఎస్కే రిలీజ్ చేసింది. దాంతో, సీఎస్కేతో అనుబంధం ముగిసినందున ప్రిటోరియస్ ఇన్స్టాగ్రామ్ వేదికగా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపాడు.
‘థాంక్యూ సీఎస్కే. ఈ ప్రయాణం చాలా గొప్పది. సీఎస్కేతో నేను కొనసాగిన కాలం నిజంగా అద్భుతం. చెన్నై మేనేజ్మెంట్, కోచ్‌లు, ఆటగాళ్లు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 2024 సీజన్‌కు ఆల్ ది బెస్ట్’ అని ప్రిటోరియస్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఈ పొడగరి ఆల్‌రౌండర్ 16వ సీజన్లో ఆడిన 7 మ్యాచుల్లో 6 వికెట్లు తీశాడంతే. ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్(Ben Stokes) కూడా 17వ సీజన్ నుంచి తప్పుకోవడంతో చెన్నై నిఖార్సైన ఆల్‌రౌండర్ వేటలో ఉంది.
ప్రిటోరియస్‌ను 2022 మెగా వేలంలో సీఎస్కే కొనుగోలు చేసింది. ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ను రూ.50 వేలకు దక్కించుకుంది. 16వ సీజన్‌కు కూడా అతడిని రీటైన్ చేసుకుంది. ఈ ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ప్రిటోరియస్.. ప్రస్తుతం టీ20 లీగ్స్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ఈ మధ్యే అతడు కరీబియన్ ప్రీమియర్ లీగ్(Caribbean Premier League)లో మెరిశాడు. గయానా అమేజాన్ వారియర్స్(Guyana Amazon Warriors)కు ప్రాతినిధ్యం వహించిన ప్రిటోరియస్ 13 మ్యాచుల్లో 20 వికెట్లతో రాణించాడు.
ఇవి కూడా చదవండి
-
Animal Movie | ‘యానిమల్’ తెలుగు హక్కులకు భారీ డిమాండ్.. ఎన్ని కోట్లంటే.?
-
CM KCR | రైతుబంధు ఇచ్చే బీఆర్ఎస్ కావాల్నా.. రైతుబంధు దుబారా అనే కాంగ్రెస్ కావాల్నా..?: సీఎం కేసీఆర్
-
dogs bite, drag toddler | పసిపాపను ఈడ్చుకెళ్లి కరిచిన పెంపుడు కుక్కలు.. యజమానిపై కేసు నమోదు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

