Shikhar Dhawan | ఫన్నీ ధావన్ ‘గబ్బర్’ అయ్యాడిలా..?
Shikhar Dhawan : భారత దిగ్గజ ఆటగాడు శిఖర్ ధావన్ (Shikhar Dhawan) సుదీర్ఘ కెరీర్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఓపెనర్‌గా ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 'గబ్బర్'(Gabbar) పేరుతో పాపులర్ అయ్యాడు. ఇంతకు అతడికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
Shikhar Dhawan : భారత దిగ్గజ ఆటగాడు శిఖర్ ధావన్ (Shikhar Dhawan) సుదీర్ఘ కెరీర్‌కు గుడ్ బై చెప్పేశాడు. జట్టులో చోటు కోసం నిరీక్షించి అలసిపోయిన ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు కూడా అల్విదా పలికాడు. ఓపెనర్‌గా ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ‘గబ్బర్'(Gabbar) పేరుతో పాపులర్ అయ్యాడు. ఇంతకు అతడికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
టీమిండియా విధ్వంసక ఓపెనర్లలో ఒకడైన ధావన్ సహచరులతో ఎంతో ఫన్నీగా ఉండేవాడు. ఎల్లప్పుడూ జోక్స్ వేస్తూ సరదాగా కనిపించేవాడు. అంతేకాదు తరచూ బాలీవుడ్ హిట్ సినిమా f’షోలే'(Sholay) సినిమాలోని డైలాగ్‌లు చెబుతుండేవాడు. రంజీ మ్యాచ్‌ల సమయంలో జట్టు సభ్యుల్లో ఉత్సాహం నింపేందుకు ధావన్ అలా చేసేవాడు. అంతేకాదు స్లిప్‌లో, గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ‘బహుత్ యారన లగ్తా హై’, ”సౌర్ కే బచొన్’ వంటి డైలాగ్స్‌తో అందర్నీ నవ్వించేవాడు. అందకని ధావన్‌కు మాజీ క్రికెటర్ విజయ్ దహియా(Vijay Dahiya) గబ్బర్ అని పేరు పెట్టాడు. అప్పటి నుంచి గబ్బర్‌గా ఈ డాషింగ్ ఓపెనర్ చేసిన హడావిడి మనకు తెలిసిందే.
కుర్రాళ్ల రాకతో..
రోహిత్ శర్మకు జోడీగా ధావన్ ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే.. శుభ్‌మన్ గిల్(Shubman Gill) దూసుకు రావడంతో అతడి స్థానానికి ఎసరొచ్చింది. స్వదేశంలో శ్రీలకం, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లలో గిల్, రోహిత్ ద్వయం బాగా హిట్ అయింది. దాంతో, ఇక ధావన్ అవసరం లేకపోయింది. సొంత గడ్డపై వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీసీసీఐ అందుకు తగ్గట్టే జట్టును ఎంపిక చేయనుంది.

ఓపెనర్‌గా రోహిత్‌తో పాటు గిల్, ఇషాన్ కిషన్(Ishan Kishan), యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) రూపంలో చాలా ఆప్షన్లు ఉన్నాయి. దాంతో, ప్రపంచ కప్ (ODI World Cup 2023) జట్టులోనూ ధావన్ ఉండే అవకాశం లేదు. అయితే.. ఈ లెఫ్ట్ హ్యాండర్ మాత్రం ఏదో ఒకరోజు చాన్స్ రాకపోతుందా? అనే నమ్మకం వ్యక్తం చేసేవాడు.
‘ఒక్క శాతం లేదా 20 శాతం అవకాశమున్నా సరే నేను సిద్ధంగా ఉన్నా. అందుకనే ఫిట్నెస్ కాపాడుకుంటున్నా’ అని ధావన్ అనేవాడు. కానీ, అనూహ్యంగా ధావన్ వీడ్కోలు వార్తతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

మైదానంలో తన సూపర్ ఆటతో అదరగొట్టిన ధావన్ వైవాహిక జీవితంలో మాత్రం ఫ్లాప్ అయ్యాడు. అతడు అయేషాను 2012 అక్టోబర్‌లో పెండ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు మొదటి భర్తతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2021లో అయేషా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ధావన్‌తో విడాకుల విషయాన్ని వెల్లడించింది. ఈమధ్యే ఫ్యామిలీ కోర్టు ఇద్దరికీ విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం అయేషా ఆస్ట్రేలియాలో ఉంటోంది. జొరావర్ కూడా ఆమెతో పాటు అక్కడే ఉంటున్నాడు.
ఇవి కూడా చదవండి
- Encounter | సోపోర్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
- Sourav Ganguly Biopic | గంగూలీ బయోపిక్‌లో బెంగాలీ నటుడు.. ఎందుకంటే..?
- AP Weather | బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. కోస్తా జిల్లాలకు భారీ వర్షసూచన
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

