Encounter | సోపోర్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
Encounter | జమ్మూకశ్మీర్‌లో సోపోర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదుల సంచారం నేపథ్యంలో పక్కా సమాచారం మేరకు సోపోర్ పోలీసులు, 32 నేషనల్ రైఫిల్స్ సంయుక్త బృందం రఫియాబాద్, సోపోర్‌లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.
Encounter | జమ్మూకశ్మీర్‌లో సోపోర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదుల సంచారం నేపథ్యంలో పక్కా సమాచారం మేరకు సోపోర్ పోలీసులు, 32 నేషనల్ రైఫిల్స్ సంయుక్త బృందం రఫియాబాద్, సోపోర్‌లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. సంఘటనా స్థలంలో ఇంకా ఉగ్రవాదులు ఉన్నారని అనుమానిస్తున్నారు. మిగతా వారి జాడ కోసం బలగాలు అన్వేషిస్తున్నాయి. హతమైన ఉగ్రవాది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఉగ్రవాదిని గుర్తించేందుకు బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకు ముందు భద్రతా బలగాలు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన పీవోకే నివాసిని గుర్తించి అరెస్ట్ చేశాయి.
సదరు వ్యక్తిని జహీర్ హుస్సేన్‌గా గుర్తించారు. భద్రతా బలగాలు అతన్ని పూంచ్‌లో పట్టుకున్నాయి. జమ్మూ కశ్మీర్లో త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలకు ఎలాంటి ఆటంకం కలగకుండా కేంద్ర ప్రభుత్వం భారీ భద్రతా బలగాలను మోహరించింది. ఇప్పటి వరకు దాదాపు 300 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. శ్రీనగర్, హంద్వారా, గందర్బల్, బుద్గాం, కుప్వారా, బారాముల్లా, బందిపోరా, అనంత్‌నాగ్, షోపియాన్, పుల్వామా, అవంతిపోరా, కుల్గామ్లలో కంపెనీలను మోహరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కాశ్మీర్ లోయలో అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సహస్త్ర సీమా బాల్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులతో సహా 298 కంపెనీల పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

