Australian Open | ఎదురులేని జకోవిచ్.. క్వార్టర్స్‌లో సబలెంక, గాఫ్
Australian Open : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టాప్ సీడ్లు రఫ్పాడిస్తున్నారు. వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో 35 ఏండ్ల అడ్రియన్ మన్నారినో(Adrian Munnarino)ను జకో...
Australian Open : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టాప్ సీడ్లు రఫ్పాడిస్తున్నారు. వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో 35 ఏండ్ల అడ్రియన్ మన్నారినో(Adrian Munnarino)ను జకో చిత్తుగా ఓడించాడు. వరుస సెట్లలో జోరు కొనసాగించిన ఈ సెర్బియా స్టార్ 6-0, 6-0, 6-3తో అలవోకగా గెలుపొంది రికార్డు స్థాయిలో 58వ సారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు.
ఈ ఫీట్‌తో జకోవిచ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్(Roger Federer) రికార్డు సమం చేశాడు. ఇప్పటివరకూ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 14సార్లు, రొలాండ్ గారోస్‌లో 17 పర్యాయాలు , వింబుల్డన్‌లో 13 సార్లు, యూఎప్ ఓపెన్‌లో13 దఫాలు క్వార్టర్స్‌లో ఆడాడు.
Through to ANOTHER #AusOpen quarterfinal ✨@DjokerNole • #AusOpen • #AO2024 pic.twitter.com/Jms4c7JWFb
— #AusOpen (@AustralianOpen) January 21, 2024
ఇక మహిళల సింగిల్స్‌లో అరినా సబలెంక(Aryna Sabalenka), అమెరికా టీనేజర్ కొకో గాఫ్(Coco Gauff) క్వార్టర్ ఫైనల్లో కాలు మోపారు. రెండో సీడ్ సబలెంక అమంద అనిసిమోవాపై 6-3, 6-2తో గెలుపొందింది. తద్వారా వరుసగా ఆరో గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.
Sunday serving session with Sabalenka and Anisimova 🌠 #DrinkResponsibly • #CanadianClubAO • #PerfectServe@wwos • @espn • @eurosport • @wowowtennis pic.twitter.com/6ftXIpOkK2
— #AusOpen (@AustralianOpen) January 21, 2024
దాంతో, అమెలీ మౌరెస్మో(Amelie Mouresmo) తర్వాత ఈ ఘనత సాధించిన చిన్న వయస్కురాలిగా సబలెంక రికార్డు నెలకొల్పింది. మరో మ్యాచ్‌లో అమెరికా సంచలనం గాఫ్.. పోలాండ్‌కు చెందిన మగ్దలెనా ఫ్రెచ్ను 6-1, 6-2తో ఓడించి తొలిసారి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.
ఇవి కూడా చదవండి
- Animal Movie | ఓటీటీలోకి రాబోతున్న ‘యానిమల్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
- Asaduddin Owaisi | అసదుద్దీన్ త్వరలో రామ నామాన్ని స్మరిస్తారు: వీహెచ్‌పీ నేత వినోద్ బన్సాల్
- BRS Majority | లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కే మెజారిటీ సీట్లు.. ఇండియా టీవీ ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

