న్యూయార్క్: టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన రికార్డును సెర్బియన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ సమం చేశాడు. సోమవారం జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో వరల్డ్ నంబర్ 2 గా ఉన్న జకోవిచ్ 6-3, 7-6 (7-5), 6-3 తేడాతో వరల్డ్ నంబర్ 3 డానిల్ మెద్వెదేవ్‌ను ఓడించాడు. దాంతో జకోవిచ్ ఖాతాలో నాలుగో యూఎస్ ఓపెన్ టైటిల్ వచ్చి చేరింది.
తాజా గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో కలిపి జోకోవిచ్ ఇప్పటి వరకు నెగ్గిన మొత్తం గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సంఖ్య 24 కు చేరింది. ఇప్పటి వరకు మాజీ టెన్నిస్ దిగ్గజం, మాజీ వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి మార్గరెట్ పేరిట ఈ రికార్డు ఉంది. ఇప్పుడు జకోవిచ్ 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గి మార్గరెట్ రికార్డును సమం చేశాడు. తాజా గెలుపు ద్వారా జకోవిచ్‌కు మూడు మిలియన్ డాలర్ల (రూ.25 కోట్లు) ప్రైజ్‌మనీ దక్కింది.