జార్జియా: ఫిడే మహిళల వరల్డ్‌కప్ ఫైనల్లో దివ్య దేశ్‌ముఖ్ సంచలనం సృష్టించింది. ఫిడే వరల్డ్ కప్ గెలిచిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. ఫైనల్లో కోనేరు హంపిపై ఆ యువ క్రీడాకారిణి విజయం సాధించింది. బ్లాక్ పీస్‌లతో ఆడిన దివ్య..అద్భుతమైన రీతిలో తోటి భారతీయురాలు హంపిని ఓడించింది. హంపి ఘోర తప్పిదం చేసినట్లు విశ్వనాథన్ ఆందన్ తెలిపారు. 54వ మూవ్లో ఎఫ్ పాన్‌ను హంపి మూవ్ చేసిందని, దీని వల్ల దివ్య ఆ టైంలో తన పాన్‌ను ఫ్రీ స్పేస్‌లోకి తీసుకెళ్లిందన్నారు. ఇది దివ్యకు బాగా అడ్వాంటేజ్ అయినట్లు ఆయన తెలిపారు.
దివ్య దేశ్‌ముఖ్ వయసు 19 ఏళ్లు. ఈ గెలుపుతో ఫిడే వరల్డ్‌కప్‌తో పాటు ఆమెకు గ్రాండ్‌మాస్టర్ టైటిల్ కూడా వచ్చేసింది. ఫిడే కప్‌ను గెలిచిన ఆనందంలో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నది. హంపితో జరిగిన ఫైనల్ చాలా థ్రిల్లింగ్‌గా సాగింది. హంపిని ఓడించిన దివ్య ఇప్పుడు చెస్ వరల్డ్‌లో సెన్షేషనల్ స్టార్ అయ్యారు. భారతీయ చెస్ క్రీడారంగంలో కొత్త తార అవతరించినట్లు అయ్యింది.
విక్టరీ తర్వాత దివ్య మాట్లాడుతూ.. దీన్ని అర్థం చేసుకోవడానికి తనకు టైం పడుతుందని, ఈ విక్టరీ ద్వారా తనకు గ్రాండ్‌మాస్టర్ టైటిల్ రావడం అదృష్టమని, ఈ టోర్నమెంట్‌కు ముందు తనకు ఎటువంటి గుర్తింపు లేదని, ఈ విక్టరీ చాలా విశేషమైందని, మునుముందు ఇంకా ఎంతో సాధించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నది. గ్రాండ్‌మాస్టర్ టైటిల్ గెలిచిన 88వ భారత చెస్ ప్లేయర్ అయ్యింది దివ్య.
Divya Deshmukh 🇮🇳 winner of the World Chess Cup and also now a Grandmaster!pic.twitter.com/UNmgiq33qq
— Chessdom (@chessdom) July 28, 2025