IND vs SL | దినుష అర్ధ శతకం.. 216/7తో టీ బ్రేక్‌కు వెళ్లిన శ్రీలంక..!
IND vs SL : కొలంబో టెస్టులో శ్రీలంక పోరాడుతోంది. ప్రసిధ్ కృష్ణ(3-46), మానవ్ సుతార్(2-71)ల విజృంభణతో ప్రధాన ఆటగాళ్లు పెవిలియన్ చేరగా ఫాల్ ఆన్ ప్రమాదంలో పడింది లంక.
IND vs SL : కొలంబో టెస్టులో శ్రీలంక పోరాడుతోంది. ప్రసిధ్ కృష్ణ(3-46), మానవ్ సుతార్(2-71)ల విజృంభణతో ప్రధాన ఆటగాళ్లు పెవిలియన్ చేరగా ఫాల్ ఆన్ ప్రమాదంలో పడింది లంక. భోజన విరామం తర్వాత వెంటవెంటనే మూడు వికెట్లు పడినా.. సోనాల్ దినుష(52 నాటౌట్) అర్ధ శతకంతో మెరిశాడు. ఎనిమిదో వికెట్‌కు కేశర నువాంత(13 నాటౌట్)తో అతడు కీలక భాగస్వామ్యం నెలకొల్పగా టీ సమయానికి ఆతిథ్య జట్టు 216జ7 స్కోర్ చేసింది.
తొలి రెండో రోజులు భారత జట్టు ఆధిపత్యం చెలాయించగా.. మూడో రోజు శ్రీలంక ఆటగాళ్లు పోరాడుతున్నారు. తొలి సెషన్లోనే ప్రసిధ్ కృష్ణ(3-46) రెండు వికెట్లతో లంకను దెబ్బకొట్టినా పసిందు సూర్యబండార(80) ఆదుకున్నాడు. టెస్టుల్లో మొదటి అర్ధ శతకంతో అతడు మెరవగా.. లంచ్ తర్వాత భారత బౌలర్లు టకటకా మూడు వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు.
That’s Tea on Day 3 of the second #SLvIND Test!
Sri Lanka 7 down as #TeamIndia picked 3⃣ wickets in the Second Session! 👍 👍
We will be back for the Final Session of the Day shortly!
Scorecard ▶️ https://t.co/r9FgXSdsMf pic.twitter.com/1vOsd043SP
— BCCI (@BCCI) August 25, 2026
కుదురుకున్న పసింద్ను జడేజా బౌల్డ్ చేసి బ్రేకివ్వగా.. సిరాజ్, మానవ్ చెరొక వికెట్ తీయగా కాసేపట్లోనే లంక ఆలౌటవ్వడం ఖాయమనిపించింది. కానీ, అడ్డుగోడలా నిలిచిన సోనాల్ దినుష(52 నాటౌట్) క్రీజునంటుకున్నాడు. టీమిండియా పేసర్లు, స్పిన్నర్లను సమర్దంగా ఎదుర్కొన్న అతడు.. నువాంత(13 నాటౌట్)తో కలిసి కీలక స్కోర్ రెండొందలు దాటించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

