Amanjot Kaur | గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్.. వీడియో
Amanjot Kaur : ముంబైలోని వాంఖడేలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత ఫీల్డర్ అమన్‌జోత్ కౌర్(Amanjot Kaur) అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంది. సైకా ఇషాక్ వేసిన 10వ ఓవర్లో అలిసే క్యాప్సే(Alice Capse)కొట్టిన బంతిని 23 ఏండ్ల అమన్‌జోత్ అమాంతం గాల్లోకి ఎగిరి....
Amanjot Kaur : స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు వరుస ఓటములు చవిచూస్తోంది. తొలి టీ20లో భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన హర్మన్‌ప్రీత్(Harmanpreet)సేన కీలకమైన రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. దాంతో, మూడు మ్యాచ్‌ల సిరీస్ ఇంగ్లండ్ వశమైంది. అయితే.. ముంబైలోని వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్ అమన్‌జోత్ కౌర్(Amanjot Kaur) అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంది.
సైకా ఇషాక్ వేసిన 10వ ఓవర్లో అలిసే క్యాప్సే(Alice Capse)కొట్టిన బంతిని 23 ఏండ్ల అమన్‌జోత్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్ పట్టింది. దాంతో, క్యాప్సీ నమ్మశక్యంకానట్టుగా పెవిలియన్ బాట పట్టింది. అమన్‌జోత్ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
I.C.Y.M.I
𝐒𝐓𝐔𝐍𝐍𝐄𝐑! 🙌 🙌
Relive Amanjot Kaur’s stunning one-handed catch to dismiss Alice Capsey. 👏 👏
Scorecard ▶️ https://t.co/ioHH8Ujek4 #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/X8Jy2Y0Qh6
— BCCI Women (@BCCIWomen) December 9, 2023
వాంఖడేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆదినుంచి తడబడింది. ఇంగ్లండ్ స్పిన్నర్లు ఒకరి తర్వాత ఒకరు వికెట్ల వేట కొనసాగించడంతో 80 పరుగులకే ఆలౌటయ్యింది. భారత జట్టులో జెమీమా రోడ్రిగ్స్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 18 రన్స్‌కే తొలి వికెట్ కోల్పోయింది. అయితే.. అలిసే క్యాప్సే(25), నాట్ సీవర్ బ్రంట్(16) సమయోచితంగా ఆడి జట్టును గెలుపు వాకిట నిలిపారు. దాంతో, 11.2 ఓవర్లలోనే ఇంగ్లండ్ లక్ష్యాన్ని ఛేదించింది. నామమాత్రమైన మూడో టీ20 ఇదే స్టేడియంలో ఆదివారం జరుగనుంది.
ఇవి కూడా చదవండి
- Lawcet 2023 | రేపట్నుంచి లాసెట్ తుది విడత కౌన్సెలింగ్
- Elnaaz Norouzi | రెడ్ మిర్చీలా ఘాటెక్కిస్తున్న ఎల్నాజ్ నోరౌజీ..
- Elnaaz Norouzi | హైదరాబాద్ గురించి ఇరానీ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

