కరాచీ: న్యూజిలాండ్ ఓపెనర్ డేవాన్ కాన్వే టెస్టుల్లో నాలుగవ సెంచరీ నమోదు చేశాడు. ఇవాళ పాకిస్థాన్‌తో ప్రారంభమైన రెండో టెస్టులో కివీస్ టీ విరామ సమయానికి 58 ఓవర్లలో వికెట్ నష్టానికి 226 రన్స్ చేసింది. కాన్వే 120, విలియమ్సన్ 29 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్‌కు టామ్ లాథమ్, కాన్వే మధ్య 134 రన్స్ భాగస్వామ్యం ఏర్పడింది. లాథమ్ 71 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇక రెండో వికెట్‌కు ఇప్పటికే కాన్వే, విలియమ్సన్ మధ్య 92 రన్స్ భాగస్వామ్యం ఏర్పడింది.
Devon Conway brings up his 4th Test ton.#WTC23 | 📝 https://t.co/5TMMWQ0jQl pic.twitter.com/NtpSAQ12ID
— ICC (@ICC) January 2, 2023