DC vs CSK | టాస్ ఢిల్లీదే.. రెండు మార్పులతో ఆడుతున్న చెన్నై..!
DC vs CSK : ప్లే ఆఫ్స్ రేసు దగ్గర పడుతున్న వేళ ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ బిగ్ మ్యాచ్కు సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన అక్షర్ పటేల్ బ్యాటింగ్ తీసుకున్నాడు.
DC vs CSK : ప్లే ఆఫ్స్ రేసు దగ్గర పడుతున్న వేళ ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ బిగ్ మ్యాచ్కు సిద్ధమయ్యాయి. గెలిస్తేనే ముందంజ వేసే పరిస్థితులు నెలకొన్నందున ఇరుజట్లు కసికొద్దీ ఆడనున్నాయి. సొంతగడ్డపై టాస్ గెలిచిన అక్షర్ పటేల్ బ్యాటింగ్ తీసుకున్నాడు. భారీ స్కోర్తో చెన్నైకి సవాల్ విసరాలని భావిస్తున్నట్టు అక్షర్ తెలిపాడు.
ప్రస్తుతం ఆరో స్థానంలోని సీఎస్కే, ఏడో స్థానంలో కొనసాగుతున్న ఢిల్లీకి ఈ మ్యాచ్ చాలా కీలకం. గాయంతో రెండు మ్యాచ్లకు దూరమైన ఎంగిడి ఆడుతున్నాడు. జేమీసన్ స్థానంలో అతడు జట్టులోకి వచ్చాడని అక్షర్ పటేల్ తెలిపాడు. చెన్నై సైతం రెండు మార్పులు చేసింది. అకీల్ హొసేన్, గుర్జప్నీత్లు తుది జట్టులోకి వచ్చారు. గత మ్యాచ్లో అర్ధ శతకంతో మెరిసిన కార్తిక్ శర్మ.. ఢిల్లీపైనా చెలరేగాలని భావిస్తున్నాడు. రికార్డులు గమనిస్తే.. ఇరుజట్లు 32 సార్లు తలపడగా చెన్నై 20 మ్యాచుల్లో, ఢిల్లీ పన్నెండింటా గెలుపొందాయి.
Solid as a rock when their teams need them the most! 🫡
Who gets your ultimate stamp of approval? 🫵
Vote Now 👉 https://t.co/2QOEa1d2Mu#TATAIPL | #KhelBindaas | #DCvCSK | @klrahul | @IamSanjuSamson pic.twitter.com/G1kwiZD2ag
— IndianPremierLeague (@IPL) May 5, 2026
ఢిల్లీ తుది జట్టు : రాహుల్(వికెట్ కీపర్), నిశాంక, కరుణ్ నాయర్, స్టబ్స్, నితీశ్ రాణా, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, స్టార్క్, ఎంగిడి, కుల్దీప్, నటరాజ్.
ఇంప్యాక్ట్ సబ్స్ – విప్రజ్ నిగమ్, సమీర్ రిజ్వీ, అభిషేక్ పొరెల్, అకీబ్ నబీ, మిల్లర్.
చెన్నై తుది జట్టు : శాంసన్(వికెట్ కీపర్), గైక్వాడ్(కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ, బ్రెవిస్, ఓవర్టన్, అకీల్ హొసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, ముకేశ్ చౌదరీ, గుర్జప్నీత్ సింగ్.
ఇంప్యాక్ట్ సబ్స్ – శివం దూబే, ప్రశాంత్ వీర్, మాథ్యూ షార్ట్, ఆకాశ్ మధ్వాల్, సర్ఫరాజ్ ఖాన్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

