ఖతార్: దోహాలోని లుసైల్ స్టేడియంలో ఆదివారం రాత్రి అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ఫైనల్ జరిగిన విషయం తెలిసిందే. థ్రిల్లర్‌లా సాగిన ఆ ఫైనల్లో.. షూటౌట్లో అర్జెంటీనా నెగ్గింది. మెస్సి తన మ్యాజికల్ ఆటతీరుతో ఫ్రాన్స్‌ను స్టన్ చేశాడు. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ట్రోఫీని ఆవిష్కరించారు. బాలీవుడ్ నటి దీపికా పదుకునే.. ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని స్టేడియంలోకి తీసుకువచ్చింది. దీపికాతో పాటు స్పెయిన్ మాజీ గోల్‌కీపర్ ఇకార్ కాసిల్లస్ కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.
ఈ ఏడాది మే నెలలో .. లూయిస్ విట్టాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికాను నియమించిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్ విజేతకు అందజేసే ట్రోఫీని దీపిక ఆవిష్కరించడం విశేషం. ఒక ప్రత్యేకమైన కేస్‌లో ఆ ట్రోఫీనికి గ్రౌండ్లోకి తీసుకువచ్చారు. ఆ పెట్ట బరువు 6.175 కేజీలు ఉంది. 18 క్యారెట్ల గోల్డ్‌తో దాన్ని తయారు చేశారు. వరల్డ్‌కప్ ట్రోఫీకి రక్షణ ఉండే రీతిలో ఆ కేస్‌ను డిజైన్ చేశారు. ట్రోఫీని స్టేడియంలోకి తెచ్చిన దీపిక వీడియో ఇదే.
😍🏆Deepika Padukone unveiled the official FIFA World Cup Qatar 2022™️ Trophy at the Lusail Stadium before the World Cup finals!
📹: AlKass #ILoveQatar #Qatar #Qatar2022 #WorldCupQatar2022 #deepikapadukone @deepikapadukone pic.twitter.com/PVQcMy0F8A— ILoveQatar – Live (@ILQLive) December 18, 2022