బెంగళూరు: యువ పేసర్ దీపక్ చాహర్ కోలుకునేందుకు మరింత సమయం పట్టేలా కనిపిస్తున్నది. విండీస్‌తో సిరీస్ సందర్భంగా గాయపడ్డ దీపక్.. ఐపీఎల్ పదిహేనో సీజన్లో ఒక్క మ్యాచ్ ఆడకుండానే లీగ్ నుంచి తప్పుకున్నాడు. ఇటీవలే వివాహ బంధంలో అడుగుపెట్టిన దీపక్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించేందుకు మరో ఐదు వారాలు పట్టే అవకాశాలున్నాయని బీసీసీఐ అధికారి తెలిపారు.
‘ప్రస్తుతం నాలుగైదు ఓవర్లు ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేయగలుగుతున్నా. మరో ఐదు వారాల్లో మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తాననే నమ్మకముంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ వరకు కోలుకుంటానో లేదో చెప్పలేను.. కానీ స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్ వరకు కచ్చితంగా పూర్తి ఫిట్నెస్ సాధిస్తా’ అని దీపక్ అన్నాడు.