మెల్బోర్న్: అరంగేట్ర పేసర్ జేవియర్ బార్ట్లెట్ (4/17) విజృంభించడంతో వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. జేవియర్ ధాటికి మొదట విండీస్ 48.4 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. కార్టీ (88), చేజ్ (59) రాణించారు.
ఆసీస్ బౌలర్లలో గ్రీన్, అబాట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆస్ట్రేలియా 38.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ (65), గ్రీన్ (77 నాటౌట్), స్మిత్ (79 నాటౌట్) అర్ధశతకాలతో మెరిశారు. జేవియర్‌కు ‘ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.