Dean Elgar | వీడ్కోలుకు ముందు ఓ గొప్ప ఇన్నింగ్స్.. రెండో సఫారీ ఓపెనర్‌గా ఎల్గర్ రికార్డు
Dean Elgar : దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్(Dean Elgar) కెరీర్‌కు వీడ్కోలుకు ముందు గొప్ప ఇన్నింగ్స్‌తో అలరించాడు. సెంచూరియన్(Centurion)లో జరుగుతున్న తొలి టెస్టులో ఈ డాషింగ్ ఓపెనర్ రికార్డు సెంచరీ బాదాడు. డబుల్ సెంచరీకి 15 పరుగుల దూరంలో శార్థూల్ ఠాకూర్(shardhul thakur) బౌలింగ్...
Dean Elgar : దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్(Dean Elgar) కెరీర్‌కు వీడ్కోలుకు ముందు గొప్ప ఇన్నింగ్స్‌తో అలరించాడు. సెంచూరియన్(Centurion)లో జరుగుతున్న తొలి టెస్టులో ఈ డాషింగ్ ఓపెనర్ రికార్డు సెంచరీ బాదాడు. డబుల్ సెంచరీకి 15 పరుగుల దూరంలో శార్థూల్ ఠాకూర్(shardhul thakur) బౌలింగ్‌లో వెనుదిరిగాడు. రాహుల్ క్యాచ్ పట్టడంతో 185 పరుగులకే వెనుదిరిగిన ఎల్గర్ సెంచూరియన్‌లో అత్యధిక రన్స్ కొట్టిన రెండో సఫారీ ఓపెనర్‌గా రికార్డుకెక్కాడు.
సెంచూరియన్ గ్రౌండ్లో సఫారీ విధ్వంసక ఓపెనర్ హెర్షలీ గిబ్స్(Herschelle Gibbs) అత్యధిక రన్స్ కొట్టాడు.. 2004లో వెస్టిండీస్‌పై గిబ్స్ 192 రన్స్‌తో వీరవిహారం చేశాడు. మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్(Graeme Smith) 139 పరుగులతో మూడో స్థానంలో నిలవగా.. గ్యారీ కిర్‌స్టెన్ 134 రన్స్‌తో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. కిర్‌స్టెన్ 1999లో వెస్టిండీస్‌పై సెంచూరియన్‌లో ఈ ఫీట్ సాధించాడు.
గ్రేమ్ స్మిత్, హెర్షలీ గిబ్స్

తొలి టెస్టులో క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ఎల్గర్ భారత బౌలర్లకు పరీక్ష పెట్టాడు. ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా గోడలా నిలబడి పరుగులు దొంగిలించాడు. చెక్కుచెదరని ఏకాగ్రతతో టెస్టుల్లో 14వ సెంచరీ నమోదు చేశాడు. ఇక మూడో రోజు కూడా క్రీజులో పాతుకుపోయిన ఎల్గర్ 185 పరుగులకు ఔటయ్యాడు.

ఆరో వికెట్‌కు మార్కో జాన్సేన్(Marco Jansen)తో కలిసి పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. భారత్‌తో టెస్టు సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలుకనున్నట్టు ఎల్గర్ ఇంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
- Relief to Indian Navy veterans | భారత మాజీ నేవీ అధికారులకు ఊరట.. మరణశిక్షను తగ్గించిన ఖతార్ కోర్టు
- Pottel Movie | తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త సినిమా.. ఆసక్తికరంగా ‘పొట్టేల్’ ఫస్ట్ లుక్ పోస్టర్
- Chandra Babu | వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయి : చంద్రబాబు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

