Pottel Movie | మల్లేశం, వకీల్‌సాబ్, మ్యాస్ట్రో వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల. ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్న తాజా చిత్రం పొట్టేల్. యువ చంద్ర కృష్ణ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘బంధం రేగడ్’, ‘సవారీ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సాహిత్ మోత్ఖురి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా వస్తుండగా ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. తెలంగాణలో బోనాల పండుగ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ పోస్టర్లో బోనాల పండుగ హైలెట్ చేస్తూ.. వేడుకల్లో అమ్మవారి ముందు పొట్టేల్‌ను బలి ఇవ్వడం, జోగిని రంగం ప్రదర్శించడం వంటి చూపిస్తూ.. పోస్టర్ ఆసక్తికరంగా సాగింది.
POTTEL 🔥#ananyanagalla pic.twitter.com/Oz88RZXAaZ
— Ananya Nagalla (@AnanyaNagalla) December 27, 2023
ఈ సినిమాను ఎన్ఐఎస్ఏ ఎంటర్టైనర్మెంట్ బ్యానర్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రగ్యా సన్నిది క్రియేషన్స్ బ్యానర్‌పై సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరీ, నీల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.